ప్రభుత్వ శాఖల్లో క్లర్క్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. SSC CHSL 2025 Notification విడుదల అయ్యింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రతి సంవత్సరం లాగే 2025లో కూడా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పరీక్ష కేంద్ర ప్రభుత్వ శాఖలలో లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) వంటి పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించబడుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ (10+2) పూర్తి చేసిన యువతకు గవర్నమెంట్ జాబ్ సాధించే అద్భుతమైన అవకాశం. ఈ ఆర్టికల్‌లో SSC CHSL 2025 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు, ఖాళీలు, దరఖాస్తు ప్రక్రియ, మరియు ముఖ్య సూచనలను తెలుసుకుందాం.
SSC CHSL 2025 గురించి తెలుసుకోండి
SSC CHSL పరీక్ష అనేది ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారి కోసం నిర్వహించే ఒక జాతీయ స్థాయి పోటీ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలు, మరియు ఇతర సంస్థలలో ఖాళీలు భర్తీ చేయబడతాయి. ఈ పరీక్షలో మూడు దశలు ఉంటాయి: టైర్-1 (ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్), టైర్-2 (డిస్క్రిప్టివ్ టెస్ట్), మరియు టైర్-3 (స్కిల్/టైపింగ్ టెస్ట్).
SSC CHSL 2025 Notification ముఖ్యమైన వివరాలు
SSC CHSL 2025 Notification ద్వారా మొత్తం 3131 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అర్హత కలిగి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
| పరీక్ష పేరు | SSC CHSL (స్టాఫ్ సెలక్షన్ కమిషన్-కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్) |
| నిర్వహణ సంస్థ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) |
| పరీక్ష స్థాయి | జాతీయ స్థాయి |
| ఖాళీలు | 3131 |
| SSC CHSL పోస్టులు | లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) |
| దరఖాస్తు పద్ధతి | ఆన్లైన్ |
| రిజిస్ట్రేషన్ తేదీలు | 23 జూన్ నుండి 18 జులై 2025 వరకు |
కావలసిన అర్హతలు
SSC CHSL 2025 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్ లేదా ఇంటర్ కు సమానమైన ఐటీఐ, డిప్లొమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
SSC CHSL 2025 కోసం దరఖాస్తు చేయాలనుకుని అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST కేటగిరీకి 5 సంవత్సరాలు, OBC కేటగిరీకి 3 సంవత్సరాలు, మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ
SSC CHSL 2025 Notification కోసం దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్‌సైట్: SSC అధికారిక వెబ్‌సైట్ (www.ssc.nic.in)
ఫీజు వివరాలు
SSC CHSL 2025 Notification కోసం దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లిచాల్సి ఉంటుంది. జనరల్/OBC అభ్యర్థులకు రూ.100/- ఫీజు ఉంటుంది. మహిళలు, SC/ST, PWD, మరియు ESM అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు.
పరీక్ష విధానం
SSC CHSL పరీక్ష మూడు దశలలో జరుగుతుంది
- టైర్-1: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ (100 ప్రశ్నలు, 200 మార్కులు, 60 నిమిషాలు). ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మరియు జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి.
- టైర్-2: డిస్క్రిప్టివ్ పేపర్ (ఎస్సే మరియు లెటర్ రాయడం, 100 మార్కులు, 60 నిమిషాలు).
- టైర్-3: స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ (DEO మరియు LDC/JSA పోస్టులకు వర్తిస్తుంది).
ముఖ్యమైన తేదీలు
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 23 జూన్ 2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 18 జులై 2025 |