ICFRE Recruitment 2025 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటోఫికేషన్ ద్వారా 25 సైంటిస్ట్ -బి పోస్టులకు భర్తీచేస్తున్నారు. వీటిని వివిధ డిసిప్లిన్స్‌లో భర్తీ చేయనున్నారు. ఈ ఆర్టికల్ లో ఈ ఖాళీలకు సంబందించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో పొందుపరచాము. ఆర్టికల్ పూర్తిగా చదివి అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేస్కోండి.
ICFRE Recruitment 2025 ముఖ్యమైన వివరాలు
| పోస్టు పేరు : | సైంటిస్ట్-బి |
| ఖాళీల సంఖ్య | 25 |
| అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 16 జూన్ 2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 15 జులై 2025 |
| జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
ఖాళీల వివరాలు
ICFREలో సైంటిస్ట్-బి పోస్టుల కోసం మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు వివిధ డిసిప్లిన్స్‌లో విభజించబడ్డాయి. కింది టేబుల్లో డిసిప్లిన్ వారీగా ఖాళీల వివరాలను చూడవచ్చు.
| వ.సం | డిసిప్లిన్ (కోడ్) | UR | EWS | SC | OBC | ST | మొత్తం |
|---|---|---|---|---|---|---|---|
| 1 | హైడ్రాలజీ (SHYD) | 1 | – | 1 | 1 | – | 3 |
| 2 | పాథాలజీ (SPTH) | 1 | 1 | – | 1 | – | 3 |
| 3 | కెమిస్ట్రీ (SCHE) | – | 1 | 1 | 1 | – | 3 |
| 4 | సాయిల్ సైన్స్ (SSSC) | 1 | – | – | – | – | 1 |
| 5 | ఫారెస్ట్ ఎకనామిక్స్ (SECM) | 1 | – | – | – | – | 1 |
| 6 | బోటనీ (SBOT) | 1 | 1 | 1 | 1 | 1 | 5 |
| 7 | ఫారెస్ట్రీ (SFOR) | 1 | 1 | 1 | 1 | – | 4 |
| 8 | ఫారెస్ట్ ఎకాలజీ & ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ (SFE&EM) | 2 | – | – | 1 | – | 3 |
| 9 | ఎంటమాలజీ (SENT) | 1 | – | – | – | – | 1 |
| 10 | జెనెటిక్స్ (SGEN) | 1 | – | – | – | – | 1 |
అర్హత ప్రమాణాలు
ప్రతి డిసిప్లిన్‌కు విభిన్న అర్హత ప్రమాణాలు ఉన్నాయి. సాధారణంగా, అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ లేదా బి.ఇ./బి.టెక్ డిగ్రీని కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు పి.హెచ్.డి. డిగ్రీ కూడా కావాల్సిన అర్హతగా ఉంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
వయస్సు
అభ్యర్థులు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది. ICFRE ఉద్యోగులకు కూడా వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ
ICFRE Recruitment 2025 సైంటిస్ట్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష: 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, మొత్తం 400 మార్కులు, 2 గంటల వ్యవధి. ఒక్కో ప్రశ్నకి 4 మార్కులు మొత్తం 400 మార్కులు.
- పర్సనల్ ఇంటర్వ్యూ: వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ కి పిలుస్తారు 70 మార్కులు.
రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు
ICFRE Recruitment 2025 సైంటిస్ట్ బి వ్రాత పరీక్షలో అర్హత సాధించడానికి కేటగిరి వారీగా సాదించవలిన మార్కులు.
- జనరల్/EWS: 50%
- OBC: 45% SC/ST: 40%
అప్లికేషన్ ఫీజు
- జనరల్, EWS, OBC: రూ. 2000/-
- SC/ST/మహిళలు/PWD: రూ. 1000/- (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే)
జీతం వివరాలు
₹56,100 నుంచి ₹1,77,500
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
- అధికారిక వెబ్సైట్ http://recruitment.icfre.gov.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
- అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
- అన్ని అర్హతలు, డాక్యుమెంట్లు సరిగ్గా ఉండాలి.
- దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
| దరఖాస్తులు ప్రారంభ తేదీ | 16 జూన్ 2025 |
| దరఖాస్తులకు చివరి తేదీ | 15 జులై 2025 |
ముఖ్యమైన లింక్స్
| Notification | Click here |
| Apply Online | Click here |