Telangana Anganwadi Jobs Notification 2025 కోసం ఎదురు చూస్తున్న మహిళలకు శుంభవార్త, 2025 సంవత్సరంలో తెలంగాణ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ 14,236 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ ని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే ఈ ఖాళీలను భర్తీ చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు రెండు రోజుల క్రితం అధికారులతో రివ్యూ చేసి ఈ పోస్టులను అతి త్వరగా భర్తీచేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన 33 జిల్లాల ఖాళీల వివరాలతో పాటు ఉద్యోగాలకు కావలసిన అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ, జీతం మరియు ఎంపిక విధానాన్ని ఈ ఆర్టికల్ లో అందిచాము.
Telangana Anganwadi Recruitment update 2025
తెలంగాణ రాష్ట్రంలో లోని శిశు సంక్షేమ శాఖకు సబందించిన అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి గతం లోనే ఆమోదం లభించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నోటిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యింది. ఇటీవల ఈ అంశంపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆలస్యానికి కారణమైన అన్ని అంకేతిక అడ్డంకుల్ని వేగంగా పరిష్కరించి ఆగస్టు మొదటి వారంలోపు నోటిఫికేషన్ విడుదల అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే 14,236 ఖాళీలు ఇలా ఉన్నాయి.
- అంగన్‌వాడీ టీచర్ (AWT): 6,399 పోస్టులు
- అంగన్‌వాడీ హెల్పర్ (AWH): 7,837 పోస్టులు
జిల్లాలవారీగా అంగన్‌వాడీ ఖాళీల అంచన.
జిల్లా | అంచనా ఖాళీలు |
---|---|
అదిలాబాద్ | 439 |
భద్రాద్రి కొత్తగూడెం | 561 |
హైదరాబాద్ | 390 |
జగిత్యాల | 439 |
జనగాం | 317 |
జయశంకర్ భూపాలపల్లి | 487 |
జోగులాంబ గద్వాల | 292 |
కామారెడ్డి | 536 |
కరీంనగర్ | 390 |
ఖమ్మం | 512 |
కొమరం భీమ్ ఆసిఫాబాద్ | 366 |
మహబూబాబాద్ | 390 |
మహబూబ్‌నగర్ | 341 |
మంచిర్యాల | 439 |
మెదక్ | 487 |
మేడ్చల్-మల్కాజ్‌గిరి | 341 |
ములుగు | 219 |
నాగర్‌కర్నూల్ | 487 |
నల్గొండ | 755 |
నారాయణపేట | 268 |
నిర్మల్ | 463 |
నిజామాబాద్ | 658 |
పెద్దపల్లి | 341 |
రాజన్న సిరిసిల్ల | 317 |
రంగారెడ్డి | 658 |
సంగారెడ్డి | 634 |
సిద్దిపేట | 536 |
సూర్యాపేట | 561 |
వికారాబాద్ | 439 |
వనపర్తి | 341 |
వరంగల్ రూరల్ | 366 |
వరంగల్ అర్బన్ | 268 |
యాదాద్రి భువనగిరి | 390 |
గమనిక: ఈ అంచనాను రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని మండలాల సంఖ్య ఆధారంగా లెక్కించాము. ఖచ్చితమైన జిల్లాలవారీ వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ కోసం వేచి చూడాల్సిందే.
విద్యార్హత
- అంగన్‌వాడీ టీచర్: గతంలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులను10వ తరగతి అర్హతతో భర్తీ చేసారు. కానీ కేంద్రప్రభుత్వ తీసుకువచ్చిన నూతన ఆదేశాలమేరకు 10+2 అర్హత తో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 10 వ తరగతిని అర్హతగా తీసుకుంటుందా లేక కేంద్రప్రభుత్వ ఆదేశాలమేరకు 10+2 ని అర్హతగా తీసుకుంటుందా అనేది నోటిఫికేషన్ విడుదల అయ్యాకే తెలుస్తుంది.
- అంగన్‌వాడీ హెల్పర్: 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ (కొన్ని జిల్లాల్లో 8వ తరగతి) ఉత్తీర్ణత సరిపోతుసరిపోతుంది.
వయస్సు పరిమితి
- అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- 65 సంవత్సరాలు దాటిన వారు సేవలకు అర్హులు కాదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/BC వర్గాలకు వయస్సు సడలింపు ఉంటుంది.
ఇతర అర్హతలు
- అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని సంబంధిత జిల్లా నివాసితులై ఉండాలి.
- స్థానిక భాషపై (తెలుగు) పట్టు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
తెలంగాణ అంగన్‌వాడీ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ సాధారణంగా రాత పరీక్ష లేకుండా నిర్వహించబడుతుంది. ఎంపిక క్రింది దశలను కలిగి ఉంటుంది.
- మెరిట్ ఆధారంగా ఎంపిక: అభ్యర్థుల విద్యార్హతలు (10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్కులు) ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: అభ్యర్థులు విద్యా సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు, డొమిసైల్ సర్టిఫికెట్ మరియు కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే) సమర్పించాలి.
- ఇంటర్వ్యూ (ఐచ్ఛికం): కొన్ని సందర్భాల్లో, పర్యవేక్షక (సూపర్‌వైజర్) పోస్టుల కోసం ఇంటర్వ్యూ నిర్వహించబడవచ్చు.
జీతం వివరాలు
- అంగన్‌వాడీ టీచర్: నెలకు సుమారు ₹12,500–₹13,500.
- అంగన్‌వాడీ హెల్పర్: నెలకు సుమారు ₹8,000.
- తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులకు జీతం పెంపును కూడా ప్రకటించింది, అయితే ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
దరఖాస్తు ప్రక్రియ
తెలంగాణ అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి క్రింది దశలను అనుసరించండి:
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: తెలంగాణ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్ (mis.tgwdcw.in లేదా జిల్లా-నిర్దిష్ట పోర్టల్)ను సందర్శించండి.
- అప్లికేషన్ ఫారమ్ పూరించండి: వ్యక్తిగత మరియు విద్యా వివరాలను ఫారమ్‌లో నమోదు చేయండి.
- డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి: విద్యా సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు, డొమిసైల్ సర్టిఫికెట్ వంటి స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
- ఫారమ్ సమర్పణ: ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ (జిల్లా నిబంధనల ప్రకారం) ఫారమ్‌ను సమర్పించండి.
- ప్రింటౌట్ తీసుకోండి: భవిష్యత్ సూచన కోసం ఫారమ్ ప్రింటౌట్ తీసుకోండి.
దరఖాస్తు రుసుము
అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ కోసం ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు, ఇది అన్ని అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశాన్ని అందిస్తుంది.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల: ఆగస్టు మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
- దరఖాస్తు గడువు: నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ప్రకటించబడుతుంది.
అంగన్‌వాడీ ఉద్యోగాల పాత్ర
అంగన్‌వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ICDS కార్యక్రమం కింద క్రింది బాధ్యతలను నిర్వహిస్తారు:
- చిన్న పిల్లలకు ప్రాథమిక విద్య అందించడం.
- గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు పోషకాహారం అందించడం.
- ఆరోగ్య తనిఖీలు మరియు టీకాల కార్యక్రమాలను నిర్వహించడం.
- గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య మరియు సంక్షేమ సేవలను ప్రోత్సహించడం.
ముగింపు.
తెలంగాణ అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2025 అనేది రాష్ట్రంలోని విద్యావంతులైన యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలనే ఆసక్తి ఉన్న వారికి అద్భుతమైన అవకాశం. ఈ అద్భుత అవకాశాన్ని వదులుకోకండి నోటిఫికేషన్ విడుదల అయినా వెంటనే అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.