SSC JE Notification 2025 out for 1340 posts | SSC నుండి 1340 JE పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది.

By Abdul Gaffar

Published On:

SSC JE Notification 2025

Join WhatsApp

Join Now

Join Teligram

Join Now

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి SSC JE Notification 2025 జూన్ 30 2025 న విడుదల అయింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సివిల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ విభాగాలలో మొత్తం 1340 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో గ్రూప్ బి (నాన్-గెజిటెడ్) పోస్టులలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 21 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈ ఆర్టికల్‌లో SSC JE Notification 2025 సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, ఖాళీల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్షా తేదీలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తిగా వివరించాము దయచేసి ఆర్టికల్ పూర్తిగా చదివి గడువు తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి.

SSC JE Notification 2025 ముఖ్య వివరాలు

SSC JE Notification 2025 ద్వారా సివిల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలలో జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ఉంటాయి. ఈ ఉద్యోగాలు లెవెల్-6 (రూ. 35,400 – రూ. 1,12,400) పే మ్యాట్రిక్స్‌లో 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వేతనం చెల్లిస్తారు.

వివరంతేదీ
నోటిఫికేషన్ విడుదల తేదీజూన్ 30, 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభంజూన్ 30, 2025
దరఖాస్తు చివరి తేదీజూలై 21, 2025
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీజూలై 22, 2025
అప్లికేషన్ కరెక్షన్ విండోఆగస్టు 1 – 2, 2025
పేపర్ 1 పరీక్షా తేదీలుఅక్టోబర్ 27 – 31, 2025
పేపర్ 2 పరీక్షా తేదీజనవరి – ఫిబ్రవరి 2026

SSC JE Notification 2025 ఖాళీల వివరాలు

SSC JE Notification 2025 ద్వారా మొత్తం 1340 జూనియర్ ఇంజనీర్ ఖాళీలు భర్తీచేయనున్నారు. ఈ ఖాళీలు సివిల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ విభాగాలలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉన్నాయి. గత సంవత్సరం 2024 లో 1701 ఖాళీలు ప్రకటించారు, కానీ ఈ సంవత్సరం ఖాళీల సంఖ్య కొంత తగ్గింది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇంకా అధికారికంగా విడుదల కానప్పటికీ, గత సంవత్సరం ట్రెండ్ ఆధారంగా క్రింది పట్టికలో అంచనా వివరాలు.

విభాగంఖాలీల అంచనా (2025)గత సంవత్సరం ఖాళీలు (2024)
సివిల్ ఇంజనీరింగ్9001200
మెకానికల్ ఇంజనీరింగ్250300
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్190201

కావలసిన విద్యార్హత

SSC JE Notification 2025 కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇంస్టిట్యూషన్ నుండి సివిల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయస్సు

  • SSC JE Notification 2025 కి దరఖాస్తు చేయాలనునే అభ్యర్థులను జనవరి 1, 2026 నాటికి 18 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • CPWD పోస్టులకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC 3 సంవత్సరాలు, PwBD 10 సంవత్సరాల సడలింపు ఉంది.

జీతం వివరాలు

SSC JE 2025 పోస్టులకు సెలెక్ట్ అయినా అభ్యర్థులకు 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం లెవెల్-6లో జీతం రూ. 35,400 రూ. 1,12,400 మధ్య ఉంటుంది. ఇందులో 50% డియర్‌నెస్ అలవెన్స్, నగరాన్ని బట్టి 9-27% HRA, రూ. 1,800-3,600 ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, CGHS వైద్య సౌకర్యాలు, NPS పెన్షన్, LTC మరియు గ్రాట్యూటీ వంటి భత్యాలు ఉంటాయి.

SBI clerk Recruitment 2025 notification details showing 6589 vacancies for junior associate poats with eligibility criteria and exam date
SBI Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application guide |స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో 6589 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఎంపిక ప్రక్రియ

SSC JE Notification 2025 ఎంపిక ప్రక్రియ మూడు దశలను కలిగి ఉంటుంది.

  1. పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్): 200 మార్కులతో ఆబ్జెక్టివ్ రకం ప్రశ్నలు. నెగెటివ్ మార్కింగ్: 0.25 మార్కులు.
  2. పేపర్ 2 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్): 300 మార్కులతో ఆబ్జెక్టివ్ రకం ప్రశ్నలు. నెగెటివ్ మార్కింగ్: 1 మార్కు.
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్: పేపర్ 1 మరియు 2లో అర్హత సాధించిన అభ్యర్థులకు.

రెండు పేపర్‌లలోనూ అభ్యర్థులు తమ విద్యా అర్హత ఆధారంగా సివిల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ విభాగంలో జనరల్ ఇంజనీరింగ్ పరీక్షను ఎంచుకోవాలి.

ఫీజు వివరాలు

  • UR/OBC/EWS: 100/-
  • SC, ST, PWD:   No Fee

దరఖాస్తు ప్రక్రియ

SC JE 2025 కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. దరఖాస్తు చేయాలనునే అభ్యర్థులు కింది దశలను అనుసరించాలి.

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: ssc.gov.in.
  2. హోమ్‌పేజీలో “Apply” ట్యాబ్‌పై క్లిక్ చేసి, “Junior Engineer (Civil, Mechanical & Electrical) Examination, 2025” లింక్‌ను ఎంచుకోండి.
  3. పేరు, జన్మ తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID వంటి వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
  4. రిజిస్ట్రేషన్ ID మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
  5. అవసరమైన వ్యక్తిగత మరియు విద్యా వివరాలను పూరించండి.
  6. స్కాన్ చేసిన ఫోటో, సంతకం మరియు ఇతర డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
  7. దరఖాస్తు రుసుము (రూ. 100) చెల్లించండి. మహిళలు, SC/ST, PwBD మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రుసుము మినహాయింపు ఉంది.
  8. దరఖాస్తును సమర్పించి, రిఫరెన్స్ కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

SSC JE 2025 సెలబస్

General Intelligence and Reasoning:

a) అనాలజీస్ , సిమిలారిటీస్ , డిఫరెన్సెస్
(b) స్పేస్ విజువలైజేషన్, స్పటిల్ ఒరియెంటేషన్
(c) ప్రాబ్లెమ్ -సొల్వింగ్, అనలైసీస్ , జడ్జిమెంట్
(d) డిసిషన్ -మేకింగ్ , విసువల్ మెమోరి
(e) డిస్క్రిమినేషన్, అబ్సర్వేషన్ల, అండ్ రేలషన్శిప్ కాన్సెప్ట్స్

Eastern Railway Apprentice Recruitment 2025
Eastern Railway Apprentice Recruitment 2025: రైల్వేలో 3115 పోస్టులతో భారీ నోటిఫికేషన్

General Awareness:

  1. కరెంట్ ఇవెంట్స్
  2. ఇండియా అండ్ ఇట్స్ నెయ్బరింగ్ కంట్రీస్
  3. హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ
  4. ఎకానమిక్ సీన్, జనరల్ పాలిటీ
  5. సైంటిఫిక్ రీసెర్చ్

General Engineering:

Civil and Structural: బిల్డింగ్ మెటీరియల్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్ అండ్ వాల్యుయేషన్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్.

Electrical: బేసిక్ కాన్సెప్ట్స్, సర్క్యూట్ లా, మాగ్నెటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్‌మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్.

Mechanical: థియరీ ఆఫ్ మెషీన్స్ అండ్ మెషీన్ డిజైన్, ఇంజినీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మటీరియల్స్, థర్మల్ ఇంజినీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్.

IBPS Clerk Recruitment 2025
IBPS Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application Guide | ప్రభుత్వబ్యాంకుల్లో 10,277 ఉద్యోగాలకునోటిఫికేషన్

ముఖ్యమైన లింక్స్

Notification Link
Afficial websiteLink


Hi! I'm Abdul Gaffar, the person behind mrjob247.com. I created this website to help people like you find the latest 🏛️ government and 🏢 private job updates easily. 📢 Every day, I share new job notifications, 📝 exam updates, and 💡 helpful tips — all in one place. My goal is to make your job search easier and save your time ⏳. 🙏 Thanks for visiting! Keep checking the site for daily updates 🔔 and all the best for your career 🎯

Leave a Comment