ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుండి NMDC Junior Manager Recruitment 2025 కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో ఉన్న జూనియర్ మేనేజర్ మరియు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) పోస్టుల ఖాళీలను భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ కి సంభందించిన దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లో 8 జులై 2025 నాడు ప్రారంభం అయింది. దరఖాస్తునకు చివరి తేదీ 28 జులై 2025. ఈ ఆర్టికల్‌లో NMDC జూనియర్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2025కి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఇచ్చాము ఆర్టికల్ పూర్తిగా చదివి చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి.
NMDC గురించి ఒక చిన్న పరిచయం
NMDC లిమిటెడ్, అనేది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక సంస్థ, ఇది ఖనిజ రంగంలో అగ్రగామిగా పనిచేస్తోంది. హైదరాబాద్‌లోని “ఖనిజ భవన్”లో కేంద్ర కార్యాలయం ఉన్న ఈ సంస్థ, దేశవ్యాప్తంగా ఖనిజ సంపద అభివృద్ధి మరియు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా, NMDC తన యూనిట్లు, మైన్స్ మరియు ఆఫీసులలో జూనియర్ మేనేజర్ మరియు AGM స్థాయిలో ఉన్న ఖాళీల్లో అర్హులైన అభ్యర్థులను నియమించటానిని నోటిఫికేషన్ విడుదల చేసింది.
NMDC Junior Manager Recruitment 2025: ముఖ్య వివరాలు
నియామక సంస్థ | నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) |
పోస్టు పేరు | జూనియర్ మేనేజర్(ఫైనాన్స్), అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) |
పోస్టుల సంఖ్య | 17 |
జాబ్ టైప్ | పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 28 జులై, 2025 |
పోస్ట్ లొకేషన్ | హైదరాబాద్ |
అఫీషియల్ వెబ్సైట్ | nmdc.co.in |
ఖాళీల వివరాలు
NMDC Junior Manager Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా NMDC జూనియర్ మేనేజర్ మరియు AGM పోస్టుల ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వారి ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్) | 10 |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) | 07 |
జైలు వార్దర్ మరియు ఇతర పోస్టుల్లో 2119 ఖాళీలు
అర్హతలు
జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్):
- బ్యాచిలర్ డిగ్రీ
- CA / CMA అర్హత లేదా
- ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు MBA (ఫైనాన్స్)
- కనీసం 2 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్):
- బ్యాచిలర్ డిగ్రీ
- CA / CMA అర్హత లేదా
- ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు MBA (ఫైనాన్స్)
- కనీసం 12 సంవత్సరాల అనుభవం
వయోపరిమితి
NMDC Junior Manager Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. జూనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మరియు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 45 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST కేటగిరి కి 5 సంవత్సరాలు, OBC కేటగిరి కి 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
NMDC Junior Manager Recruitment 2025 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తమ ఫీజు ఆన్లైన్ లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
కేటగిరి | దరఖాస్తు ఫీజు |
---|---|
UR / OBC / EWS | రూ.500/- |
SC / ST / PwBD / ExSm | మినహాయింపు కలదు (No fee) |
జీతం వివరాలు
NMDC Junior Manager Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయ జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వం కల్పించే ఇతర సదుపాయాలు ఉంటాయి.
Post Name | Salary (Per Month) |
Junior Manager (Finance) | Rs.50000-160000/- |
Assistant General Manager (Finance) | Rs.100000-260000/- |
దరఖాస్తు విధానం
NMDC జూనియర్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది
1. ముందుగా NMDC Recruitment Notification 2025 ను పూర్తిగా చదవండి మరియు మీ అర్హతను బట్టి దరఖాస్తు చేయదగిన పోస్టు ను ఎన్నుకోండి.
2. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభించే ముందు సరైన ఇమెయిల్ ఐడీ మరియు మొబైల్ నంబర్ తో సిద్ధంగా ఉండండి.
3. గుర్తింపు పత్రం, వయస్సు రుజువు, విద్యార్హతలు, అనుభవం (ఉంటే), రెజ్యూమే వంటి అవసరమైన డాక్యుమెంట్స్‌ను ముందుగా సిద్ధం చేసుకోండి.
4. వెబ్‌సైట్ లాగిన్: NMDC అధికారిక వెబ్‌సైట్ www.nmdc.co.inలోని “Careers” సెక్షన్‌ను సందర్శించండి
5. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మీ మొబైల్ నెంబర్ అండ్ ఇమెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకోండి.
6. వివరాలు నమోదు: అభ్యర్థులు తమ విద్యార్హత, అనుభవం, వ్యక్తిగత వివరాలు మరియు ఇతర సమాచారాన్ని ఆన్‌లైన్ ఫారమ్‌లో నమోదు చేయాలి.
7. డాక్యుమెంట్ల అప్‌లోడ్: కావలసిన డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
-
- ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- 10వ తరగతి సర్టిఫికేట్
- విద్యార్హత మరియు అనుభవ సర్టిఫికెట్లు
- SC/ST/OBC(NCL)/EWS/PwBD సర్టిఫికేట్లు (వర్తిస్తే)
- సంతకం
8. అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయండి.
ఎంపిక ప్రక్రియ
NMDC జూనియర్ మేనేజర్ మరియు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో క్రింది దశలు ఉంటాయి:
- ఆన్‌లైన్ అప్లికేషన్ స్క్రీనింగ్: ముందుగా అభ్యర్థులు సమర్పించిన వివరాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కోసం అడ్మిట్ కార్డ్/కాల్ లెటర్ జారీ చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థుల ఒరిజినల్ డాక్యుమెంట్లు తనిఖీ చేయబడతాయి.
- అంతిమ ఎంపిక: అభ్యర్థుల అర్హత, ఇంటర్వ్యూ లో పెరఫార్మెన్సు బట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేసుకుంటారు.