ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి ICG Assistant Commandant Recruitment 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ మరియు టెక్నికల్ బ్రాంచుల్లో ఉన్న 170 అసిస్టెంట్ కమాండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ 8 జులై 2025 నాడు ప్రారంభం అవుతుంది. దరఖాస్తునకు చివరి తేదీ 23 జులై 2025. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైటు https://joinindiancoastguard.cdac.in లో దరఖాస్తు చేసుకోవాలి.
ICG Assistant Commandant Recruitment 2025: ముఖ్య వివరాలు
అంశం | వివరాలు |
---|---|
నియామక సంస్థ | ఇండియన్ కోస్ట్ గార్డ్ |
పోస్టు పేరు | అసిస్టెంట్ కమాండెంట్ |
ఖాళీల సంఖ్య | 170 |
జాబ్ లొకేషన్ | అల్ ఇండియా |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 8 జులై 2025 |
దరఖాస్తు చివరి తేదీ | 23 జులై 2025 |
ఎంపిక ప్రక్రియ | వ్రాత పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్ |
ICG Assistant Commandant Recruitment 2025: భళీళ వివరాలు
ICG Assistant Commandant Recruitment 2025 ద్వార 2027 బ్యాచ్ కి జనరల్ డ్యూటీ మరియు టెక్నికల్ (ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు మొత్తం 170 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వారి ఖాలీలకోసం క్రింది పట్టికను పరిశీలించండి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
---|---|
జనరల్ డ్యూటీ (GD) | 140 |
టెక్నికల్ ఇంజినీరింగ్ | 30 |
విద్యా అర్హతలు (Educational Qualifications)
ICG Assistant Commandant Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు జనరల్ డ్యూటీ (GD) మరియు టెక్నికల్ బ్రాంచ్‌లకు సంబంధించిన విద్యా అర్హతలను కలిగి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో గణితం మరియు భౌతికశాస్త్రం సబ్జెక్టులను చదివి ఉండాలి. టెక్నికల్ బ్రాంచ్‌కు సంబంధించి, ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు నిర్దిష్ట మార్కులు సాధించి ఉండాలి.
జనరల్ డ్యూటీ (GD):
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.
- ఇంటర్మీడియట్ లేదా 10+2+3 విద్యా విధానంలో XII తరగతి వరకు గణితం మరియు భౌతికశాస్త్రం సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
- డిప్లొమా తర్వాత రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు, కానీ వారి డిప్లొమా కరిక్యులంలో భౌతికశాస్త్రం మరియు గణితం ఉండాలి.
- టెక్నికల్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్):
- సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) కనీసం 60% మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలి.
- ఇంటర్మీడియట్ లేదా 10+2+3 విద్యా విధానంలో XII తరగతి వరకు గణితం మరియు భౌతికశాస్త్రం సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
- డిప్లొమా తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు, కానీ వారి డిప్లొమా కరిక్యులంలో భౌతికశాస్త్రం మరియు గణితం ఉండాలి.
వయోపరిమితి
ICG Assistant Commandant Recruitment 2025 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/T అభ్యర్థులకు సంవత్సరాలు OBC లకు 3 సంవత్సరాల వయోసడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు
ICG Assistant Commandant Recruitment 2025 జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300/- మరియు ఎస్టీ / ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కేటగిరి | ఫీజు |
UR / EWS / OBC | రూ.300/- |
SC / ST | ఫీజు లేదు (మినహాయింపు కలదు) |
ఫీజు చెల్లింపు విధానం | ఆన్ లైన్ |
ఎంపిక ప్రక్రియ
ICG Assistant Commandant Recruitment 2025 ఎంపిక అల్ ఇండియా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఐదు దశలు ఉంటాయి.
- CGCAT: కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు దశ II కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
- PSB: ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్. ఇందులో కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్ (CCBT) మరియు పిక్చర్ పెర్సెప్షన్ & డిస్కషన్ టెస్ట్ (PP&DT) ఉంటాయి.
- FSB: ఫైనల్ సెలక్షన్ బోర్డ్. ఇది నోయిడాలోని కోస్ట్ గార్డ్ సెలక్షన్ బోర్డ్‌లో 4-5 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, మరియు ఇంటర్వ్యూ ఉంటాయి.
- మెడికల్ ఎగ్జామినేషన్: న్యూ ఢిల్లీలోని బేస్ హాస్పిటల్‌లో ప్రత్యేక వైద్య పరీక్ష జరుగుతుంది.
- ఇండక్షన్: ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ నావల్ అకాడమీ (INA), ఎజిమలలో శిక్షణ కోసం రిపోర్ట్ చేయాలి.
ప్రతి దశలో బయోమెట్రిక్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అన్ని దశలలో అర్హత సాధించినవారు మాత్రమే తుది ఎంపికకు పరిగణించబడతారు.
జీతం వివరాలు:
ICG Assistant Commandant Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు 7వ కేంద్ర వేతన కమిషన్ (7 CPC) ప్రకారం వేతనం అందించబడుతుంది. బేసిక్ పే రూ.56,100/- ఉంటుంది. ఇతర అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.70,000/- వరకు జీతం ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: joinindiancoastguard.cdac.in
- ‘Assistant Commandant – 01/2027 బ్యాచ్’ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
- ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయండి దీని ద్వారా మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ లభిస్తాయి.
- లాగిన్ అయ్యి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాన్ని యాక్సెస్ చేయండి.
- వ్యక్తిగత, విద్యా కు సంబంధిత మరియు కమ్యూనికేషన్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయండి.
- స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయండి:
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- సంతకం
- విద్యా ధ్రువీకరణ పత్రాలు
- కేటగిరీ సంబంధిత సర్టిఫికేట్లు (SC/ST/OBC/EWS)
- మీరు దరఖాస్తు చేయాలనుకున్న పోస్టును ఎంచుకోండి, మరియు పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోండి.
- అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో చెక్ చేయండి, అవసరమైతే సరిదిద్దండి.
9. ఆన్‌లైన్ పేమెంట్ మోడ్ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించండి.
10. ఫారాన్ని సమర్పించి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి – భవిష్యత్తు కోసం భద్రపరచండి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 8 జులై 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 23 జులై 2025
మూల్క్యమైన లింక్స్ (Impotrtanat Links)
ముగింపు:
ICG అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్మెంట్ 2025 దేశ సేవకు అంకితమైన యువతకు ఒక గొప్ప అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2 thoughts on “ICG Assistant Commandant Recruitment 2025 / ఇండియన్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు నోటిఫికేషన్”