IBPS SO Recruitment 2025 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి 1,007 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మొత్తం ఖాళీలను వివిధ బ్యాంకుల్లో భర్తీచేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ 1 జులై 2025 నుండి ప్రారంభం అయింది దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 21 జులై 2025. ఈ IBPS SO Recruitment 2025 కి సంబంధించిన పూర్తి వివరాలు ఖాళీలు, అర్హతలు, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ మరియు ఎంపిక విధానం గురించి స్పష్టంగా వివరించాము దయచేసి ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి.
IBPS SO Recruitment 2025 ముఖ్య వివరాలు
| నియామక సంస్థపేరు | ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) |
| పరీక్ష పేరు | IBPS SO 2025 |
| పోస్టు పేరు | స్పెషలిస్ట్ ఆఫీసర్ |
| ఖాలీల సంఖ్య | 1007 |
| దరఖాస్తు తేదీలు | 1 జులై 2025 నుండి 21 జులై 2025 వరకు |
| అఫీషియల్ వెబ్సైట్ | www.ibps.in |
IBPS SO Recruitment 2025 ఖాలీలా సంఖ్య
IBPS SO Recruitment 2025 విడుదల చేసిన ఈ ఖాళీలను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఐటి ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ / పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, లా ఆఫీసర్, మరియు రాజభాష అధికారి వంటి పోస్టులలో భర్తీ చేయనున్నారు, ఈ ఖాళీలు పోస్టుల వారీగా క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి గమనించగలరు.
| పోస్టు పేరు | ఖాళీలు |
| అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ | 310 |
| మార్కెటింగ్ ఆఫీసర్ | 350 |
| ఐటీ ఆఫీసర్ | 203 |
| రాజ్ భాష అధికారి | 78 |
| లా ఆఫీసర్ | 56 |
| హెచ్ఆర్ / పర్సనల్ ఆఫీసర్ | 10 |
| మొత్తం ఖాళీలు | 1007 |
కావలసిన విద్యార్హతలు
IBPS SO Recruitment 2025 దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు ప్రతి పోస్టుకు నిర్దిష్ట విద్యార్హతలు అవసరం.
- IT Officer: ఇంజనీరింగ్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/IT) లేదా సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేషన్
- Agricultural Field Officer: వ్యవసాయ ఇంజనీరింగ్ లేదా సంబంధిత డిగ్రీ
- Law Officer: న్యాయ డిగ్రీ (LLB)
- HR/Personnel Officer: HR మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ లేదా డిప్లొమా
- Marketing Officer: మార్కెటింగ్‌లో MBA లేదా సంబంధిత డిగ్రీ
- Rajbhasha Adhikari: హిందీ/సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్
వయోపరిమితి
IBPS SO Recruitment 2025 దరఖాస్తుదారుని వయస్సు 1 జనవరి 2025 నాటికి 20 నుడి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయసు సడలింపు కలదు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC (నాన్-క్రీమీ లేయర్) వారికి 3 సంవత్సరాలు, PwBD (Persons with Benchmark Disabilities) అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు కలదు.
జీతం వివరాలు
IBPS SO Recruitment 2025 ద్వారా ఎంపికైన స్పెషలిస్ట్ ఆఫీసర్లకు (Scale-I) జీతం లభిస్తుంది. సాధారణంగా, IBPS SO (Scale-I) పోస్టులకు జీతం రూ. 36,000 నుండి రూ. 64,000 వరకు (బేసిక్ పే) ఉంటుంది, దీనికి అదనంగా డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), మరియు ఇతర అలవెన్స్‌లు కలిపి మొత్తం జీతం నెలకు రూ. 50,000 నుండి రూ. 80,000 వరకు ఉండవచ్చు.
పరీక్షా ఫీజు
IBPS SO Recruitment 2025 కోసం దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఫీజు వివరాలకోసం క్రింది పట్టికను పరిశీలించండి.
| Category | Application Fee |
| General and Others | Rs. 850/- |
| SC/ST/PWD | Rs. 175/- |
పరీక్ష విధానం
IBPS SO Recruitment 2025 పరీక్షా విధానం 3 దశల్లో ఉంటుంది.
- ప్రిలిమినరీ పరీక్ష: ఇది స్క్రీనింగ్ దశ, ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లేదా జనరల్ అవేర్‌నెస్ (పోస్ట్‌ను బట్టి) పరీక్షించబడతాయి.
- మెయిన్స్ పరీక్ష: ఈ దశలో ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై ఆధారపడిన ప్రశ్నలు ఉంటాయి, మరియు రాజ్‌భాషా అధికారి పోస్ట్‌కు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు కూడా ఉంటాయి.
- ఇంటర్వ్యూ: మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఇది 100 మార్కులకు నిర్వహించబడుతుంది.
దరఖాస్తు ప్రక్రియ
IBPS SO Recruitment 2025 దరఖాస్తులు ఆన్లైన్ లో అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
- www.ibps.inలో “NEW REGISTRATION” బటన్‌పై క్లిక్ చేయాలి.
- పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, చిరునామా వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.
- ప్రొవిషనల్ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి.
అవసరమైన డాక్యుమెంట్లు:
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో (20-50 KB, 4.5 cm x 3.5 cm).
- సంతకం (10-20 KB, నలుపు ఇంక్‌తో తెల్ల కాగితంపై).
- ఎడమ చేతి బొటనవేలు ముద్ర (10-20 KB).
- చేతితో రాసిన డిక్లరేషన్.
- SSC/10వ తరగతి సర్టిఫికెట్ (PDF ఫార్మాట్‌లో, 500 KB లోపు).
సబ్మిషన్
- వివరాలు ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన సూచనలు
- అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి, ఎందుకంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్ జరుగుతుంది.
- చివరి తేదీ దగ్గరవుతున్నప్పుడు సర్వర్ లోడ్ ఎక్కువగా ఉండవచ్చు, కాబట్టి ముందుగానే దరఖాస్తు చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ముఖ్యమైన లింక్స్
| Notification | Link |
| Offucial Website | Link |
ముగింపు
IBPS SO Recruitment 2025 బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్ కోరుకునే వారికి గొప్ప అవకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సరైన ప్రిపరేషన్‌తో పరీక్షలకు సిద్ధమై, సకాలంలో దరఖాస్తు చేయండి. పూర్తి వివరాల కోసం www.ibps.in సందర్శించండి.
గమనిక: మిత్రులారా మన mrjobs247.com website లో ఎప్పటికప్పుడు జాబ్స్ కి సంభందించిన updates ఇస్తూనే ఉంటాం కావున ఈ వెబ్సైటు ని విసిట్ చేస్తూ ఉండండి.. జాబ్ updates కోసం మా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం మరిచిపోవద్దు.