10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు ఇంటెలిజెన్స్ బ్యూరో IB Security Assistant Recruitment 2025 Notification విడుదల చేసి ఒక అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం 10వ తరగతి అర్హతతో 4987 Security Assistant/Executive (SA/Exe) ఖాళీలను భర్తీచేస్తుంది. ఈ నోటిఫికేషన్ సంభందించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 26, జులై, 2025న ప్రారంభం అవుతుంది. ఈ ఉద్యోగానికి సంభందించిన పూర్తీ వివరాలు వయసు, వేతనం, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తెలుసుకోవటానికి ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.
IB Security Assistant Recruitment 2025 Overview
IB Security Assistant Notification 2025 ద్వారా విడుదల అయిన Security Assistant/Executive (SA/Exe) పోస్టులు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఈ ఉద్యోగాలు గ్రూప్ ‘C’, నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ కేటగిరీలోకి వస్తాయి. దరఖాస్తు చేయాలనే అభ్యర్థులు 26, జులై 2025 నుండి 17, ఆగష్టు, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ సేవలో భాగం కావాలనుకునే యువతకు ఈ ఉద్యోగాలు గొప్ప అవకాశం.
విభాగం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) |
నిర్వహణ సంస్థ | హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs – MHA) |
పోస్టు పేరు | సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (SA/Exe) |
ఖాళీలు | 4987 |
ఉద్యోగ రకం | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
విద్యార్హత | 10వ తరగతి ఉత్తీర్ణత |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 26 జూలై 2025 |
దరఖాస్తు ముగింపు తేదీ | 17 ఆగస్టు 2025 (ఉదయం 11:59 వరకు) |
ఎంపిక ప్రక్రియ | టియర్ 1, టియర్ 2 & టియర్ 3 రాత పరీక్షలు |
జీతం | ₹21,700 నుండి ₹69,100 (పే లెవెల్-3 ప్రకారం) |
అధికారిక వెబ్‌సైట్ | www.mha.gov.in |
IB Security Assistant Notification 2025 Vacancy
ఈ సంవత్సరం ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) వివిధ రాష్టాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీలభర్తీకి మొత్తం 4987 పోస్టులను విడుదల చేసింది. రాష్ట్రాలవారిగా వివిధ క్యాటగిగిరిల్లో ఉన్న భళీలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
నగరం/కేంద్రం | OC | EWS | OBC | SC | ST | మొత్తం |
---|---|---|---|---|---|---|
అగర్తలా | 29 | 7 | 0 | 11 | 20 | 67 |
అహ్మదాబాద్ | 137 | 30 | 77 | 17 | 46 | 307 |
ఐజాల్ | 31 | 5 | 2 | 0 | 15 | 53 |
అమృత్‌సర్ | 42 | 7 | 8 | 17 | 0 | 74 |
బెంగళూరు | 109 | 20 | 31 | 32 | 12 | 204 |
భోపాల్ | 36 | 9 | 13 | 12 | 17 | 87 |
భువనేశ్వర్ | 34 | 8 | 4 | 12 | 18 | 76 |
చండీగఢ్ | 40 | 9 | 25 | 12 | 0 | 86 |
చెన్నై | 172 | 29 | 31 | 51 | 2 | 285 |
డెహ్రాడూన్ | 24 | 4 | 3 | 6 | 0 | 37 |
ఢిల్లీ | 491 | 112 | 287 | 156 | 78 | 1124 |
గాంగ్‌టోక్ | 16 | 3 | 6 | 2 | 6 | 33 |
గౌహతి | 63 | 12 | 29 | 7 | 13 | 124 |
హైదరాబాద్ | 63 | 12 | 18 | 17 | 7 | 117 |
ఇంఫాల్ | 23 | 4 | 2 | 1 | 9 | 39 |
ఇటానగర్ | 100 | 18 | 0 | 0 | 62 | 180 |
జైపూర్ | 71 | 13 | 33 | 3 | 10 | 130 |
జమ్మూ | 32 | 8 | 11 | 22 | 2 | 75 |
కలింపోంగ్ | 7 | 2 | 0 | 1 | 5 | 14 |
కోహిమా | 24 | 6 | 12 | 14 | 0 | 56 |
కోల్‌కతా | 130 | 28 | 85 | 0 | 37 | 280 |
లేహ్ | 21 | 4 | 4 | 8 | 0 | 37 |
లక్నో | 96 | 23 | 63 | 45 | 2 | 229 |
మీరట్ | 20 | 4 | 10 | 7 | 0 | 41 |
ముంబయి | 157 | 27 | 45 | 18 | 19 | 266 |
నాగ్‌పూర్ | 21 | 3 | 6 | 1 | 1 | 32 |
పణజీ | 29 | 4 | 2 | 0 | 7 | 42 |
పాట్నా | 77 | 16 | 44 | 26 | 1 | 164 |
రాయ్పూర్ | 16 | 3 | 0 | 5 | 4 | 28 |
రాంచీ | 16 | 3 | 3 | 3 | 8 | 33 |
షిల్లాంగ్ | 19 | 3 | 2 | 0 | 9 | 33 |
శిమ్లా | 17 | 4 | 8 | 9 | 2 | 40 |
సిలిగురి | 18 | 4 | 7 | 8 | 2 | 39 |
శ్రీనగర్ | 30 | 6 | 15 | 4 | 3 | 58 |
త్రివేండ్రం | 183 | 34 | 94 | 21 | 2 | 334 |
వారణాసి | 24 | 5 | 10 | 9 | 0 | 48 |
విజయవాడ | 53 | 12 | 25 | 18 | 7 | 115 |
మొత్తం | 2471 | 501 | 1015 | 574 | 426 | 4987 |
డిగ్రీఅర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరో లోఉద్యోగఅవకాశాలు
IB Security Assistant Recruitment 2025 Eligibility Criteria
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హత (10th pass), వయస్సు, ప్రాంతీయత, భాష వంటి ముఖ్యమైన అర్హతలు కలిగి ఉండాలి.
విద్యార్హత:
- అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుండి మ్యాట్రిక్యులేషన్ (10వ తరగతి ఉత్తీర్ణత) లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.
- అభ్యర్థులు దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన డొమెసైల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయస్సు:
అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి (17, ఆగష్టు, 2025 నాటికీ 27 సంవత్సరాలు మించకూడదు) రిజర్వేడ్ కేటగిరి అభ్యర్థులకు వయస్సు సడలింపు కలదు.
వయస్సు సడలింపు:
- ఎస్సీ / ఎస్టీ (SC/ST): 5 సంవత్సరాల వయస్సు సడలింపు
- ఓబీసీ (OBC): 3 సంవత్సరాల వయస్సు సడలింపు
- దివ్యాంగులు (PwD): 10 సంవత్సరాల వయస్సు సడలింపు
IB SA Recruitment 2025 Fee
IB SA Recruitment 2025 కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Category | Recruitment Processing Fee | Application Fee | Total Fees |
All Candidates | Rs. 450/- | Nil | Rs. 450/- |
General, EWS, OBC (Male) | Rs. 450/- | Rs. 100/- | Rs. 550/- |
IB SA Recruitment 2025 Aplication Link
IB SA Recruitment 2025 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ లో చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ 26, జులై, 2025 నాడు అందుబాటులో ఉంటుంది. లింక్ ఆక్టివ్ అవ్వగానే మా వెబ్సైట్ లో అప్డేట్ చేస్తాము. అప్పటివరకు అభ్యర్థులు అన్నీ డాకుమెంట్స్, మరియు సర్టిఫికెట్స్ తో సిద్ధంగా ఉండండి.
IB Security Assistant 2025 Sellection Process
Tier I – Objective Test
- ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT).
- సమయం: 60 నిముషాలు
- మొత్తం మార్కులు: 100
- నెగటివ్ మార్కింగ్: ఒక్కో తప్పు సమాధానానికి 0.25 మార్కులుతగ్గిస్తారు.
- ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి.
- సబ్జెక్ట్స్: రిజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్
- కట్-ఆఫ్ మార్కులు: UR/EWS – 30, OBC – 28, SC/ST – 25
Tier-II (Descriptive Test)
- మొత్తం మార్కులు: 50
- వివరణాత్మక రచనా నైపుణ్యం: దరఖాస్తు చేసిన ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ భాష మీద పట్టును పరీక్షిస్తారు.
- టైర్ II కేవలం అర్హత పరీక్ష మాత్రమే, ఈ మార్కులు మెరిట్‌లో లెక్కించబడవు.
Tier-III (Interview / వ్యక్తిత్వ పరీక్ష)
- Tier-I మరియు Tier-II లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు పిలుపు ఉంటుంది.
- అభ్యర్థి వ్యక్తిత్వం, నైపుణ్యాలు, మరియు పోస్టుకు అనుకూలతను ఈ దశలో పరిశీలిస్తారు.
తుది ఎంపిక:
- టియర్ I మరియు టియర్ III లో అభ్యర్థి ప్రదర్శన ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
- టియర్ II కేవలం అర్హత దశగా మాత్రమే పరిగణించబడుతుంది.