IB ACIO Recruitment 2025 Notification 14 జులై 2025న 3,717 IB ACIO గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టులతో విడుదలైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 19 జులై 2025 నుండి mha.gov.in లేదా ncs.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ భారతదేశంలోని అత్యున్నత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరోలో గ్రూప్ ‘C’ (నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్) పోస్టుల కోసం నిర్వహించబడుతుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, సిలబస్, పరీక్షా విధానం మరియు దరఖాస్తు వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
IB ACIO Notification 2025 వివరాలు
IB ACIO Notification 2025 ద్వారా విడుదల అయినా ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో ఉద్యోగం సాధించడం అంటే గొప్ప అవకాశంగా భావిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు డిగ్రీ అర్హతతో అస్సిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నియామక సంస్థ | Intelligence Bureau (IB) |
పోస్టు పేరు | ACIO-II |
ఖాళీల సంఖ్య | 3717 |
అర్హత | Any Degree |
దరఖాస్తు విధానం | Online |
దరఖాస్తులకు చివరి తేదీ | 10, August, 2025 |
వయోపరిమితి | 18-27 |
జీతం | Rs. 44,900 to Rs. 1,42,400 |
అఫీషియల్ వెబ్సైట్ | mha.gov.in |
IB ACIO VACANCY 2025 వివరాలు
ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి విడుదల అయినా 3717 Assistant Central Intelligence Officer ( ACIO) ఖాళీలు వివరాలు కేటగిరి వైస్ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
Category | Number of Vacancies |
UR | 1,537 |
EWS | 442 |
OBC | 946 |
SC | 566 |
ST | 226 |
Total | 3,717 |
IB ACIO VACANCY 2025 ELIGIBILITY (అర్హత)
IB ACIO VACANCY 2025 కోసం దరఖాస్తు చేయాలంటే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలు తప్పనిసరి. నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలు ఏంటో చూద్దాం.
విద్య అర్హత:
అభ్యర్థులు Assistant Central Intelligence Officer ( ACIO) పోస్టులకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అదనంగా బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి:
IB ACIO Recruitment 2025 Notification కు దరఖాస్తు చేసే అభ్యర్థి నోటిఫికేషన్ లో సూచించిన వయస్సు ఉండాలి.
కనిష్ట వయస్సు: 18
గరిష్ట వయస్సు: 27 (10, ఆగష్టు 2025 నాటికి)
వయోసడలింపు
కొన్ని కేటగిగి అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
- SC/ST: 5 సంవత్సరాలు (32 సంవత్సరాల వరకు)
- OBC: 3 సంవత్సరాలు (30 సంవత్సరాల వరకు)
- డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు (3+ సంవత్సరాల సర్వీస్ ఉన్నవారు): 40 సంవత్సరాల వరకు (జనరల్ కేటగిరీ మాత్రమే)
- వితంతువులు / విడాకులు తీసుకున్న / న్యాయపరంగా విడిపోయిన మహిళలు: 40 సంవత్సరాల వరకు
- UR: 35 సంవత్సరాల వరకు
- OBC: 38 సంవత్సరాల వరకు
- SC/ST: 40 సంవత్సరాల వరకు
- మెరిటోరియస్ స్పోర్ట్స్‌పర్సన్స్: 5 సంవత్సరాల వరకు (DoPT నిబంధనల ప్రకారం)
- ఎక్స్-సర్వీస్‌మెన్: కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు
IB ACIO 2025 aplication Fee (ఫీజు వివరాలు)
IB ACIO 2025 దరకాస్తు ఫీజు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. రిజర్వేడ్ కేటగిరి అభ్యర్థులకు ఫీజు లో రాయితీ కలదు.
Category | Recruitment Processing Fee | Application Fee | Total Fees |
---|---|---|---|
All Candidates | Rs. 450/- | Nil | Rs. 450/- |
General, EWS, OBC (Male) | Rs. 450/- | Rs. 100/- | Rs. 550/- |
IB ACIO 2025 Aplication proces (దరఖాస్తు విధానం)
IB ACIO 2025 దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లో 19, జులై 2025 నుండి ప్రారంభం అవుతుంది.
- MHA అధికారిక వెబ్‌సైట్ (mha.gov.in)ని సందర్శించండి.
- “Careers” లేదా “Vacancies” సెక్షన్‌కు వెళ్లండి.
- IB ACIO Apply Online 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ పేరు, ఇమెయిల్ ID, మరియు మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేయండి.
- ఇమెయిల్ ద్వారా వచ్చిన క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి.
- దరఖాస్తు ఫారమ్‌ను ఖచ్చితమైన వివరాలతో పూరించండి.
- మార్గదర్శకాల ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
- ఆన్‌లైన్ మోడ్‌ల ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి.
- ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు ఉపయోగం కోసం కన్ఫర్మేషన్ రసీదును డౌన్‌లోడ్ చేయండి.
IB ACIO 2025 Recruitment 2025 Sellection Process (ఎంపిక విధానం)
IB ACIO 2025 అభ్జ్యర్తుల ఎంపిక ప్రక్రియ 3 దశల్లో ఉంటుంది. Tier 1, Tier 2, and Tier 3 (Interview).
Tier-I Exam:
ఆబ్జెక్టివ్ రకం పరీక్ష, 100 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQs), ప్రతి విభాగం నుండి 20 ప్రశ్నలు.
Tier-II Exam:
డిస్క్రిప్టివ్ పరీక్ష: వ్యాసం (20 మార్కులు) మరియు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ (10 మార్కులు). వ్యాసం, ప్రెసిస్ రాయడం మరియు కాంప్రిహెన్షన్/ప్యాసేజ్‌ను పరిష్కరించడం.
Interview:
చివరిగా ఇంటర్వ్యూ ఉంటుంది.
IB ACIO 2025 Exam Pattern పరీక్షా విధానం
IB ACIO 2025 Exam రెండు దశల్లో వ్రాత పరీక్షా ఉంటుంది.
- The Tier 1 IB ACIO Exam లో Current Affairs, General Studies, Numerical Aptitude, Reasoning and Logical Aptitude, and English నుండి 100 ప్రశ్నలకు 1000 మర్క్స్ ఉంటాయి.
- The Tier 2 exam: 50 మార్కులు, వ్యాసం (20 మార్కులు) మరియు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ (10 మార్కులు). వ్యాసం, ప్రెసిస్ రాయడం మరియు కాంప్రిహెన్షన్/ప్యాసేజ్‌ను పరిష్కరించడం (20 మార్కులు)
Important Links
ముగింపు
IB ACIO గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 భారతదేశ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రతిష్ఠాత్మక కెరీర్‌ను నిర్మించుకోవడానికి అద్భుతమైన అవకాశం. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా జాతీయ భద్రతలో భాగం కావాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ ఉద్యోగం కెరీర్ గ్రోత్ తో పాటు మంచి గుర్తింపుని ఇస్తుంది. ఇలాంటి అద్భుత అవకాశాన్ని వదులుకోకండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 19 జులై 2025 నుండి mha.gov.in లేదా ncs.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.