CSIR NEERI notification 2025
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసే వారికోసం ఒక మంచి నోటిఫికేషన్ ని మీ ముందుకు తీసుకు వచ్చాము. ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR-National Environmental Engineering Research Institute నుండి Junior Secretariat Assistant మరియు junior stenographer Jobs కోసం CSIR NEERI notification 2025 విడుదల చేసింది.
CSIR-National Environmental Engineering Research Institute Job Notification ని విడుదల చేసింది ఈ Job నోటిఫికేషన్ ద్వారా junior Secretariat Assistant మరియు junior stenographer పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ Job కి 10+2 అర్హత తో పాటు టైపింగ్/స్టెనోగ్రఫీ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు అర్హులు, జాబ్ కి అప్లై చేయదలచిన అభ్యర్థులు తమ అప్లికేషన్స్ ని 1st April 2025 నుండి 30th April 2025 వరకు ఆన్‌లైన్ లో సమర్పించవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంభందించిన పూర్తి సమాచారం విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age , Salary వంటి వంటి అన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో ఇచ్చాము దయచేసి ఆర్టికల్ ని పూర్తిగా చదివి గడువు తేదీ లోపు అప్లై చేస్కోండి.
Job Details: Junior Secretariat Assistant & junior stenographer
Junior Secretariat Assistant (JSA): Junior Secretariat Assistant (JSA) కోసం మూడు విభాగాల్లో 26 పోస్టులు ఉన్నాయి. ఇందులో జనరల్ (14), ఫైనాన్స్ & అకౌంట్స్ (5), మరియు స్టోర్స్ & పర్చేస్ (7) పోస్టులు ఉన్నాయి. కనీసం 10+2/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం ఉండాలి. ఈ పోస్టుకు సుమారు ₹36,493 వేతనం ఉంటుంది.
junior stenographer: junior stenographer పోస్టులకి 7 ఖాళీలు ఉన్నాయి. వీటికి 10+2 పాస్ అయి, స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ (DoPT) ఉన్నవారే అర్హులు. ఈ పోస్టుకు నెలకు ₹49,623 స్కేల్ ప్రకారం సెలరీ అందిస్తారు. రెండు ఉద్యోగాల్లోనూ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవారికే ప్రాధాన్యత లభిస్తుంది.
Important Details
పోస్ట్ పేరు | పోస్టుల సంఖ్యా | అర్హత | వేతనం |
---|---|---|---|
Junior Secretariat Assistant (General) | 14 | 10+2 / XII, కంప్యూటర్ టైపింగ్ | సుమారు Rs. 36,493/- |
Junior Secretariat Assistant (Finance & Accounts) | 05 | 10+2 / XII, కంప్యూటర్ నైపుణ్యం | సుమారు Rs. 36,493/- |
Junior Secretariat Assistant (Sports & Research | 07 | 10+2 / XII, కంప్యూటర్ నైపుణ్యం | సుమారు Rs. 36,493/- |
junior stenographer | 07 | 10+2 / XII, స్టెనోగ్రఫీ నైపుణ్యం | సుమారు Rs. 49,623/- |
అప్లికేషన్ మరియు ఎంపిక ప్రక్రియ
CSIR-NEERI 2025 ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు 1st April 2025 నుండి 30th April 2025 వరకు CSIR-NEER అధికారిక వెబ్‌సైట్ ( www.neeri.res.in లేదా career.neeri.res.in ) ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ముందుగా వెబ్‌సైట్‌లో తమ పేరు, ఇమెయిల్, మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి. తరువాత, అప్లికేషన్ ఫారం లో వ్యక్తిగత, మరియు ఇతర వివరాలను భర్తీ చేసి, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, స్టడీ సర్టిఫికెట్ మరియు ఇతర అవసరమైన క్యాటగరీ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజుగా రూ. 500/- చెల్లించాల్సి ఉంటుంది. అయితే SC, ST, PwBD, Women, Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అన్ని వివరాలు సరిగ్గా తనిఖీ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేసి, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. ఒకసారి అప్లికేషన్ సమర్పించిన తర్వాత మార్పులు చేయడం సాధ్యపడదు.
ఎంపిక మరియు పరీక్షా విధానం
Junior Secretariat Assistant (JSA) selection procedure
ఈ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక లఖిత పరీక్ష మరియు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.
లఖిత పరీక్ష: లఖిత పరీక్ష రెండు పేపర్లతో జరుగుతుంది. Paper-I అర్హత నిర్ధారణ కోసం నిర్వహించబడుతుంది, అయితే Paper-II తుది ఎంపిక కోసం కీలకం అవుతుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి, పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. ముఖ్యంగా, Paper-II లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
కంప్యూటర్ టైపింగ్ టెస్ట్: ఈ టెస్ట్ లో అభ్యర్థులు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పడాలి, హిందీ లో మిమిషానికి 30 పదాల స్పీడ్ తో టైప్ చేయగలగాలి. పరీక్ష సమయం 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది.ఇది కేవలం అర్హత నిర్ధారణ పరీక్ష మాత్రమే, దీనికి తుది మెరిట్ లిస్ట్‌లో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.
junior stenographer selection procedure
ఈ ఉద్యోగానికి అభ్యర్థులను లఖిత పరీక్ష మరియు స్టెనోగ్రఫీ ప్రోఫిసిఎన్సీ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
లఖిత పరీక్ష: లిఖిత పరీక్ష లో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి ఇందులో English Language & Comprehension, General Intelligence & Reasoning, General Awareness అనే విభాగాలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.
Stenography Proficiency Test: ఈ పరీక్ష లో అభ్యర్థులో నిమిషానికి 80 పడాల స్పీడ్ తో చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష లోసం 10 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది.
వయస్సు పరిమితి
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి కనీస వయసు 18 నుండి 28 సంవత్సరాల వయసు వారు అర్హులు.
రిజర్వేషన్లు
SC, ST, OBC (Non-Creamy Layer), EWS, PwBD, Ex-Servicemen అభ్యర్థులకు రిజర్వేషన్ లభిస్తుంది.
రిజర్వేషన్ నిబంధనల ప్రకారం, అర్హత కలిగిన అభ్యర్థులకు వయస్సులో సడలింపు, అప్లికేషన్ ఫీజులో మినహాయింపు మరియు ఎంపిక ప్రక్రియలో ప్రత్యేక రాయితీలు కూడా ఉంటాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు కనీస వయస్సు ఎంత?
అన్ని పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. అయితే, గరిష్ట వయస్సు పోస్టు వారీగా భిన్నంగా ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఎంపిక లఖిత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష/స్టెనోగ్రఫీ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు రెండు దశలను విజయవంతంగా పూర్తిచేయాలి.
రిజర్వేషన్ సౌకర్యాలు ఎవరికి వర్తిస్తాయి?
SC, ST, OBC (Non-Creamy Layer), EWS, PwBD, మరియు Ex-Servicemen అభ్యర్థులకు రిజర్వేషన్ అందుబాటులో ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (www.neeri.res.in లేదా career.neeri.res.in) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్‌ను సమర్పించే ముందు అన్ని వివరాలు సరిచూడాలి.
టైపింగ్/స్టెనోగ్రఫీ పరీక్షకు ప్రాముఖ్యత ఏంటి?
టైపింగ్ పరీక్ష జూనియర్ కార్యదర్శి సహాయకులు (JSA) కోసం, మరియు స్టెనోగ్రఫీ పరీక్ష జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు తప్పనిసరిగా ఉంటుంది. అయితే, వీటిని కేవలం అర్హత నిర్ధారణ పరీక్షలుగానే పరిగణిస్తారు, తుది మెరిట్ లిస్ట్‌లో వీటి స్కోరు ఎఫెక్ట్ అవదు.