CCI Recruitment 2025| సిమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లో ఉంద్యోగ అవకాశాలు

By Abdul Gaffar

Published On:

CCI Recruitment 2025

Join WhatsApp

Join Now

Join Teligram

Join Now

కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) నుండి CCI Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రంగాలలో మొత్తం 29 ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంభందించిన పూర్తి సమాచారం విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్, శాలరీ వంటి వంటి అన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో పొందుపరచాము దయచేసి ఆర్టికల్ ని పూర్తిగా చదివి గడువు తేదీ లోపు అప్లై చేస్కోండి.

CCI Recruitment 2025 Overview

నియామక సంస్థ పేరుసిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI)
పోస్టు పేరుఇంజనీర్, ఆఫీసర్ మరియు అనలిస్ట్
పోస్టుల సంఖ్య29
ఏజ్ లిమిట్35
విద్య అర్హతB.E/B.Tech/M.Sc/Diploma
జీతం40,000/-
ఉద్యోగ రకంకాంట్రాక్ట్ 

CCI Recruitment 2025 ఖాళీల వివరాలు

CCI Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి మరియు వివిధ డిపార్ట్‌మెంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్ మరియు ఎన్విరాన్‌మెంట్ రంగాలలో ఈ ఖాళీలు ఉన్నాయి.

పోస్టు (Post)విభాగం (Department)ఖాళీల సంఖ్య (Number of Vacancies)
ఇంజనీర్ప్రొడక్షన్ (Production)8
ఇంజనీర్మెకానికల్ (Mechanical)6
ఇంజనీర్సివిల్ (Civil)3
ఇంజనీర్మైనింగ్ (Mining)4
ఇంజనీర్ఇన్‌స్ట్రుమెంటేషన్ (Instrumentation)4
ఇంజనీర్ఎలక్ట్రికల్ (Electrical)4
ఆఫీసర్ఫైనాన్స్ & అకౌంట్స్ (Finance & Accounts)2
ఆఫీసర్మానవ వనరులు (Human Resources)2
ఆఫీసర్మార్కెటింగ్ (Marketing)2
అనలిస్ట్పర్యావరణం (Environment)1
మొత్తం (Total)29

CCI రిక్రూట్‌మెంట్ 2025: అర్హత ప్రమాణాలు

CCI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. ఈ అన్ని పోస్టులకు కావలసిన విద్యార్హతల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

SBI clerk Recruitment 2025 notification details showing 6589 vacancies for junior associate poats with eligibility criteria and exam date
SBI Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application guide |స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో 6589 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
పోస్టు (Post)విద్యార్హత (Educational Qualification)అనుభవం (Experience)
ఇంజనీర్ (ప్రొడక్షన్)కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా ఎమ్.ఎస్సీ (కెమిస్ట్రీ)కనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో
ఇంజనీర్ (మెకానికల్)మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీకనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో
ఇంజనీర్ (సివిల్)సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీకనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో
ఇంజనీర్ (మైనింగ్)మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీకనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో
ఇంజనీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీకనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో
ఇంజనీర్ (ఎలక్ట్రికల్)ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీకనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో
ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్)CA / CMA లేదా MBA (ఫైనాన్స్)కనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో
ఆఫీసర్ (HR)MBA (HR) లేదా సంబంధిత డిగ్రీకనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో
ఆఫీసర్ (మార్కెటింగ్)MBA (మార్కెటింగ్)కనీసం 2 సంవత్సరాలు సంబంధిత రంగంలో

వయస్సు

CCI Recruitment 2025 కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాల లోపు వయసు ఉండాలి అనలిస్ట్ పోస్టులకి 40 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.

వయోసడలింపు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు కలదు. 

CCI రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు ఫీజు వివరాలు

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు ఫీజు వివరాలు.

Eastern Railway Apprentice Recruitment 2025
Eastern Railway Apprentice Recruitment 2025: రైల్వేలో 3115 పోస్టులతో భారీ నోటిఫికేషన్
  • జనరల్ (UR), OBC, EWS కేటగిరీలు: అభ్యర్థులు రూ. 100/- డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ “Cement Corporation of India Limited” పేరుతో న్యూ ఢిల్లీలో చెల్లుబాటు అయ్యేలా ఉండాలి.
  • SC, ST, PWD, మహిళా అభ్యర్థులు: ఈ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఉంది, అంటే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • దరఖాస్తు ఫీజు ఆఫ్‌లైన్ విధానంలో డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత రీఫండ్ చేయబడదు, కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తమ అర్హతను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలి.

CCI Recruitment 2025 ఎంపిక ప్రక్రియ

  • ఇంటర్వ్యూ: దరఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కి పిలుస్తారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఇంటర్వ్యూ లో అర్హత సాధించిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఈ దశలో అవసరమైతే అభ్యర్థిదారుని ఒరిజినల్ డాక్యుమెంట్లు తనిఖీ చేస్తారు.
  • మెడికల్ ఎగ్జామినేషన్: ఎంపికైన అభ్యర్థులు మెడికల్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు ఈ CCI నిబంధనలకు అనుగుణంగా జరుగుతుంది.

జీతం వివరాలు: 

CCI Recruitment 2025 లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹40,000/- కన్సాలిడేటెడ్ రూపంలో జీతం ఇస్తారు, ఇందులో ప్రతి సంవత్సరం 5% వార్షిక ఇంక్రిమెంట్ ఉంటుంది. కార్పొరేట్/రీజనల్/జోనల్ కార్యాలయాలలో పోస్టింగ్ పొందిన అభ్యర్థులకు వసతి కోసం అదనంగా నెలకు ₹10,000/-ఇస్తారు , యూనిట్లలో పోస్టింగ్ ఉన్నవారికి వసతి అందుబాటులో ఉంటే ఇవ్వడం జరుగుతుంది. అదనంగా, EPF చట్టం ప్రకారం ప్రావిడెంట్ ఫండ్, IPD వైద్య సౌకర్యం, సంవత్సరానికి 20 రోజుల సెలవు, E-1 స్థాయి ఉద్యోగులకు వర్తించే TA/DA మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాతృత్వ సెలవు వంటి ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

దరఖాస్తు విధానం:

CCI Recruitment 2025 కు దరఖాస్తు చేసుకోవాలని అనుకున్న అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  • అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్: అభ్యర్థులు CCI అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • వివరాలు నింపడం: ఫార్మ్‌లో అన్ని వివరాలను సరిగ్గా నింపి, లేటెస్ట్ ఫోటో అతికించి ఫార్మ్ మీద సంతకాన్ని చేయాలి.
  • డాక్యుమెంట్లు జతపరచడం: విద్యార్హతలు, అనుభవం, వయస్సు, కుల ధ్రువీకరణ పత్రాల సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను అప్లికేషన్‌తో జతపరచాలి.
  • అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు చెల్లించిన డీడీ మరియు అన్ని డాక్యుమెంట్స్ ఒక కవరులో ఉంచి కింద ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి.
  • పోస్ట్ ద్వారా పంపడం: పూర్తి చేసిన అప్లికేషన్‌ను “AGM (HR), Cement Corporation of India Limited, Post Box No.: 3061, Lodhi Road Post Office, New Delhi-110003” చిరునామాకు సాధారణ పోస్ట్ ద్వారా పంపాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభం: 22 జూన్ 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ: 12 జులై 2025

ముఖ్యమైలా లింక్స్

నోటిఫికేషన్ లింక్Link
ఆఫిసియల్ వెబ్సైటుLink


IBPS Clerk Recruitment 2025
IBPS Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application Guide | ప్రభుత్వబ్యాంకుల్లో 10,277 ఉద్యోగాలకునోటిఫికేషన్

 

Hi! I'm Abdul Gaffar, the person behind mrjob247.com. I created this website to help people like you find the latest 🏛️ government and 🏢 private job updates easily. 📢 Every day, I share new job notifications, 📝 exam updates, and 💡 helpful tips — all in one place. My goal is to make your job search easier and save your time ⏳. 🙏 Thanks for visiting! Keep checking the site for daily updates 🔔 and all the best for your career 🎯

Leave a Comment