నిరుద్యోగ యువతకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 సంవత్సరానికి APPSC Forest Beat Officer Notification 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లో 16, జులై, 2025 న ప్రారంభం అవుతున్నది దరఖాస్తునకు చివరి తేదీ 05, ఆగష్టు 2025. ఈ ఆర్టికల్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అర్హత, ఖాళీల వివరాలు, దరఖాస్తు ప్రక్రియ, పరీక్షా విధానం మరియు ఎంపిక ప్రక్రియ వంటి అన్ని అంశాలను ఇచ్చాము.
APPSC Forest Beat Officer Recruitment 2025: వివరాలు
APPSC Forest Beat Officer Recruitment 2025 కి సంబంధించి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 14, జులై 2025 నాడు విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 691 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను Forest Beat Officer (FBO) మరియు Assistant Beat Officer (ABO) పోస్టుల్లో భర్తీ చేస్తున్నారు.
నియామక సంస్థ | Andhra Pradesh Public Service Commission (APPSC) |
పోస్టు పేరు | Forest Beat Officer (FBO), Assistant Beat Officer (ABO) |
ఖాళీల సంఖ్య | 691 |
అర్హత | 12th pass |
దరఖాస్తు విధానం | Online |
దరఖాస్తులకు చివరి తేదీ | 05, August, 2025 |
వయోపరిమితి | 18-30 |
అఫీషియల్ వెబ్సైట్ | www.psc.ap.gov.in |
Important Dates (ముఖ్యమైన తేదీలు):
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 14 జూలై 2025
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 16 జూలై 2025
- దరఖాస్తుకు చివరి తేదీ: 5 ఆగస్టు 2025
APPSC Forest Officer Vacancies 2025 (ఖాళీల వివరాలు)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మొత్తం 691 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుంది. Forest Beat Officer 246, Assistant Beat Officer 435 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.
Post Name | Current Vacancies | Backlog Vacancies | Total Vacancies |
Forest Beat Officer (FBO) | 175 | 81 | 246 |
Assistant Beat Officer (ABO) | 375 | 60 | 435 |
Total | 550 | 141 | 691 |
కావలసిన అర్హత
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ లో అడిగిన అర్హతలు తప్పనిసరి.
విద్య అర్హత:
అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు ద్వారా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
APPSC Forest Beat Officer Recruitment 2025 కు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
వయోసడలింపు:
- SC/ST/BC/EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
- CF ఖాళీలకు దరఖాస్తు చేసే SC/ST అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
స్థానికత:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. స్థానికతను నిర్ధారించడానికి చదువు లేదా నివాస ధృవీకరణ పత్రం అవసరం.
శారీరక ప్రమాణాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ పోస్టులు అటవీ శాఖలో ఫీల్డ్ వర్క్‌ను కలిగి ఉన్నందున, అభ్యర్థుల శారీరక సామర్థ్యం చాలా ముఖ్యం. నోటిఫికేషన్ నెం. 06/2025 ప్రకారం శారీరక ప్రమాణాలు క్రింది విధంగా ఉన్నాయి:
ఎత్తు (Height):
- పురుష అభ్యర్థులు: కనీసం 163 సెం.మీ (5 అడుగుల 4 అంగుళాలు).
- మహిళా అభ్యర్థులు: కనీసం 150 సెం.మీ (4 అడుగుల 11 అంగుళాలు).
- షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) మరియు ఏజెన్సీ ప్రాంతాల అభ్యర్థులకు: పురుషులకు 152 సెం.మీ, మహిళలకు 145 సెం.మీ.
ఛాతీ (Chest)
- పురుష అభ్యర్థులు: కనీసం 79 సెం.మీ (విస్తరణతో 84 సెం.మీ).
- మహిళా అభ్యర్థులకు: ఛాతీ కొలతలు వర్తించవు, కానీ శారీరక దృఢత్వం అవసరం.
శారీరక సామర్థ్య పరీక్ష (Physical Efficiency Test):
వాకింగ్ టెస్ట్:
- పురుష అభ్యర్థులు: 25 కి.మీ నడకను 4 గంటలలో పూర్తి చేయాలి.
- మహిళా అభ్యర్థులు: 16 కి.మీ నడకను 4 గంటలలో పూర్తి చేయాలి.
- ఈ పరీక్ష అటవీ ప్రాంతాల్లో పనిచేయడానికి అభ్యర్థుల శారీరక సత్తాను పరీక్షిస్తుంది.
APPSC FBO ABO Aplication Fee 2025
APPSC FBO ABO దరకాస్తు దారులు దరఖాస్తు ఫీజు ఆన్లైన్ లో మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, BC, EWS, మాజీ సైనికులు, తెల్ల రేషన్ కార్ద్ హోల్డర్లు, నిరుద్యోగ యువతకు ఫీజు మినహాయింపు కలదు వారు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
వర్గం (Category) | దరఖాస్తు ఫీజు (Application Fees) |
---|---|
SC/ST/BC/EWS, మరియు మాజీ సైనికులు, నిరుద్యోగ యువకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరా విభాగం ద్వారా జారీ చేసిన వైట్ కార్డు కలిగిన కుటుంబాలు | రూ. 250/- |
ఇతర వర్గాలు మరియు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు | రూ. 330/- |
దరఖాస్తు ప్రక్రియ
- ఆన్‌లైన్ దరఖాస్తు: అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు.
- వివరాలు నమోదు: దరఖాస్తు ఫారమ్‌లో అన్ని వివరాలను ఖచ్చితంగా మరియు పూర్తిగా నింపాలి. తప్పుడు సమాచారం అందిస్తే అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది.
- డేటా మార్పు ఫీజు: దరఖాస్తు సమర్పించిన తర్వాత వివరాలలో మార్పులు చేయాలంటే రూ.100 ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో రెండు దశల పరీక్షలు ఉంటాయి:
- స్క్రీనింగ్ టెస్ట్:
- ఇది ప్రాథమిక పరీక్ష, ఆబ్జెక్టివ్ టైప్‌లో నిర్వహించబడుతుంది.
- కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామినేషన్‌కు అర్హులవుతారు
2. మెయిన్ ఎగ్జామినేషన్:
- రెండు పేపర్లు ఉంటాయి:
- పేపర్-1: జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ (100 మార్కులు).
- పేపర్-2: జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్ (100 మార్కులు).
- ఈ పరీక్షలు SSC స్థాయిలో నిర్వహించబడతాయి.
APPSC FBO ABO Salary 2025 (జీతం వివరాలు)
APPSC FBO ABO recruitment లో సెలెక్ట్ అయినా వారికా మంచి శాలరీ తో పటు 7th పే కమిషన్ ప్రకారం TA.DA,HRA కూడా లభిస్తుంది.
Posts | Pay Scale |
Forest Beat Officer (FBO) | Rs. 25,220 – 80,910 |
Assistant Beat Officer (ABO) | Rs. 23,120 – 74,770 |