AP DME Recruitment 2025: 1,183 Posts | Notification & Application Details.

By Abdul Gaffar

Published On:

AP DME RECRUITMENT

Join WhatsApp

Join Now

Join Teligram

Join Now

మిత్రులకి నమస్కారం!
ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న వారికి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన DIRECTORATE OF MEDICAL EDUCATION (DME) నుండి 1,183 జాబ్స్ కోసం AP DME Recruitment Notification 2025 విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రెసిడెంట్ అనే ఉద్యోగాలకు notification ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులను ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్, వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష నిర్వహించకుండా, కేవలం అభ్యర్థుల మెరిట్ మార్కుల ఆధారంగా సెలెక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు మార్చ్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, గరిష్టంగా 44 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి కూడా వయస్సు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో PG (పోస్ట్ గ్రాడ్యుయేషన్) అర్హత కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాల్లో ఎంపికైన వారు 74 వేల రూపాయలకు పైగా జీతం పొందే అవకాశం ఉంది. ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోకండి!

ఈ ఆర్టికల్ చదివి మీకు ఈ ఉద్యోగానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నట్టు అయితే వెంటనే గడువు తేదీ అయ్యేలోపు ఈ jobs కి apply చేస్కోండి. 

Organization Details

  • Organizatin name: Directorate of Medical Education
  • Role of the Organizatin: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ విద్యను పర్యవేక్షించడం, మెడికల్ విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వహించడంలో మెడికల్ విద్యా విభాగం (DME) కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మరియు ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య విద్య, శిక్షణ, ఆరోగ్య సేవలు అందేలా చూసే బాధ్యత ఈ సంస్థదే.

Important Details of the Notification

  • నోటిఫికేషన్ నంబర్: 1/2025
  • నోటిఫికేషన్ విడుదల తేది: 05-03-2025
  • ఖాళీల సంఖ్య: 1,183 (ఈ సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంది)
  • పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్ (Broad మరియు Super Specialties)
  • విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ విద్యా విభాగం (DME, AP)
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

Eligibility Criteria (కావలసిన అర్హతలు)

1. విద్యార్హతలు

  • అభ్యర్థి MD / MS / DNB / DM / MCh / MDS లో పోస్టు పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి
  • National Medical Commission (NMC) ద్వారా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుండి డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి.
  • DNB (Diplomate of National Board) లో డిగ్రీ పొందిన అభ్యర్థులు 500 లేదా అంతకంటే ఎక్కువ పడకల (Beds) ఆసుపత్రిలో శిక్షణ పొంది ఉండాలి.
  • AP Medical Council / Dental Council లో రిజిస్ట్రేషన్ చేచేయించుకొని ఉండాలి.

2. Age (వయోపరిమితి): నోటిఫికేషన్ విడుదల తేదీ (05-03-2025) నాటికి అభ్యర్థి అధికంగా 44 సంవత్సరాల లోపు ఉండాలి. SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

3. Eligibility of local candidates (స్థానిక అభ్యర్థుల అర్హత):

SBI clerk Recruitment 2025 notification details showing 6589 vacancies for junior associate poats with eligibility criteria and exam date
SBI Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application guide |స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో 6589 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • అభ్యర్థి 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లో చదివి ఉండాలి.
  • తెలంగాణలో చదివి, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి మారిన అభ్యర్థులు G.O.Ms.No.132 & 133 (GA Dept., Dt: 13-06-2016) ప్రకారం రెవెన్యూ అధికారుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
  • AP Medical Council / AP Dental Council లో రిజిస్ట్రేషన్ ఉన్న నాన్-లోకల్ అభ్యర్థులు స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మాత్రమే ఎంపిక అవుతారు.

Salary (జీతం)

categorySalary/Moth
Broad Specialties₹80,500/-
Super Specialties₹97,750/-
Dentistry₹74,750/-

Tenure (పదవీకాలం)

సీనియర్ రెసిడెంట్ పోస్టులు తాత్కాలికంగా 1 సంవత్సరం పాటు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా ఒక సంవత్సరం పూర్తి చేయవలసి ఉంటుంది.

Application Procedure (దరఖాస్తు విధానం)

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే జరుగుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను 07-03-2025 నుండి 22-03-2025 వరకు సమర్పించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఏ విధంగానూ అంగీకరించబడవు, కాబట్టి అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇకపోతే, గతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేసిన వారు లేదా ఇప్పటికే 1 సంవత్సరం పూర్తి చేసిన వారు ఈ అవకాశానికి అర్హులు కారు, కాబట్టి వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

Required Documents (అవసరమైన డాక్యుమెంట్లు)

  1. 10వ తరగతి సర్టిఫికేట్ (పుట్టిన తేదీ నిర్ధారణ)
  2. AP Medical / Dental Council రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
  3. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ మార్క్స్ మెమోలు
  4. MBBS/BDS & MD/MS/DNB/DM/MCh/MDS డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్
  5. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన విద్యాసంస్థల ధృవీకరణ పత్రం
  6. కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC/EWS)
  7. PH ధృవీకరణ పత్రం (అస్తిత్వం ఉంటే మాత్రమే)
  8. ఆధార్ కార్డు

Application Fee (దరఖాస్తు రుసుం)

కేటగిరీఫీజు (₹)
OC₹2,000/-
BC, SC, ST₹1,000/-

Selection Process (ఎంపిక విధానం)

AP DME Recruitment 2025 ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పరీక్షలో పొందిన మొత్తం మార్కులను బట్టి మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది. అలాగే, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఉద్యోగాల కేటాయింపు జరుగుతుంది. ఒకే మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థుల విషయంలో, పుట్టిన తేదీని ఆధారంగా తీసుకుని, వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

Important Dates (ముఖ్యమైన తేదీలు)


Event
Date
నోటిఫికేషన్ విడుదల05-03-2025
దరఖాస్తు ప్రారంభం07-03-2025
దరఖాస్తు ముగింపు22-03-2025

DIRECTORATE OF MEDICAL EDUCATION (DME) జారీచేసిన ఉద్యోగాలకు అర్హులైన, మరియు ఆసక్తి కలిగిన వైద్య అభ్యర్థులు వెంటనే చివరి గడువు తేదీ ముగిసే లోపు అప్లై చేసుకోండి.

Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Eastern Railway Apprentice Recruitment 2025
Eastern Railway Apprentice Recruitment 2025: రైల్వేలో 3115 పోస్టులతో భారీ నోటిఫికేషన్

Official Website

Apply Online

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు ఎలా చేయాలి

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

2. నాన్-లోకల్ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులా?

లోకల్ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మాత్రమే నాన్-లోకల్ అభ్యర్థులు ఎంపిక అవుతారు.

3. ఎంపిక ఏ విధంగా జరుగుతుంది?

పోస్ట్‌గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఎంపిక చేస్తారు.

IBPS Clerk Recruitment 2025
IBPS Clerk Recruitment 2025: Notification, Eligibility, & Online Application Guide | ప్రభుత్వబ్యాంకుల్లో 10,277 ఉద్యోగాలకునోటిఫికేషన్

4. ఈ ఉద్యోగాల పదవీకాలం ఎంత?

ఈ ఉద్యోగం తాత్కాలికంగా 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది.

Hi! I'm Abdul Gaffar, the person behind mrjob247.com. I created this website to help people like you find the latest 🏛️ government and 🏢 private job updates easily. 📢 Every day, I share new job notifications, 📝 exam updates, and 💡 helpful tips — all in one place. My goal is to make your job search easier and save your time ⏳. 🙏 Thanks for visiting! Keep checking the site for daily updates 🔔 and all the best for your career 🎯

Leave a Comment