DRDO Scientist Recruitment 2025 కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 20 Project Scientist పోస్టులను కాంట్రాక్టు పద్దతి లో భర్తీ చేయనున్నారు. DRDO Scientist Recruitment 2025 application process ఇప్పటికే official website లో మొదలైంది, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 1 ఏప్రిల్ 2025. ఈ ఆర్టికల్ లో నోటిఫికేషన్ కి సంభందించిన అన్ని విషయాలు, ఖాళీల సంఖ్యా, సెలక్షన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీజు, ఆన్లైన్ అప్లికేషన్ తేదీ, కావలసిన విద్య అర్హతలు, వంటి అన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆర్టికల్ పూర్తీ చదివి అప్లై చేస్కోండి.
DRDO Scientist Recruitment 2025 Key details.
- ప్రకటన నంబర్: 154
- సంస్థ పేరు: DRDO – రిక్రూట్‌మెంట్ & అసెస్‌మెంట్ సెంటర్ (RAC)
- పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘F’, ‘D’, ‘C’, ‘B’
- మొత్తం ఖాళీలు: 20
- వయోపరిమితి: 56
- జీతం: 90,784 నుండి మొదలు
- దరఖాస్తు మెదలైన తేదీ: 8 మార్చ్ 2025
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (rac.gov.in) వెబ్‌సైట్ ద్వారా)
- దరఖాస్తు చివరి తేదీ: 1 ఏప్రిల్ 2025 (సాయంత్రం 4:00 గంటల వరకు)
DRDO Scientist Recruitment 2025 Vacancies and Required Qualification.
1. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘F’
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘F’ పోస్టుకు DRDO హైదరాబాదులో ఒక్క ఖాళీ మాత్రమే ఉంది. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి ₹2,20,717/- వేతనం లభిస్తుంది. ఈ హై-లెవల్ సైంటిఫిక్ రోల్ కోసం అభ్యర్థులు కనీసం ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్) పూర్తిచేసి ఉండాలి. అంతేకాక, అభ్యర్థులు కనీసం 10 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి, ముఖ్యంగా C/C++, Python, Perl/Bash లాంటి ప్రోగ్రామింగ్ భాషలతో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డిజైన్ & డీప్-లెవల్ కోడింగ్ అనుభవం ఉండాలి. అదనంగా, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో అనుభవం ఉంటే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
2. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘D‘
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘D’ పోస్టుకు 10 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగంలో చేరిన వారికి ₹1,24,612/- వేతనం లభిస్తుంది. ఈ రోల్‌కు కావలసిన అర్హత , అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ కలిగి, కనీసం 5 ఏళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా RF సిస్టమ్స్, టెస్టింగ్, Matlab/Simulink వంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్నవారికి అడ్వాంటేజ్ ఉంటుంది . ఎలక్ట్రానిక్ మరియు రేడియో ఫ్రీక్వెన్సీ (RF) వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, పరీక్షలలో అనుభవం ఉన్నవారికి ఈ ఉద్యోగం మరింత మంచి అవకాశంగా మారుతుంది. ప్రభుత్వ రంగంలో, ప్రత్యేకంగా రక్షణ రంగంలో, మీ టాలెంట్‌ను ప్రదర్శించడానికి ఇది మంచి ఛాన్స్!
3. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘C’
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘C’ పోస్టులో 7 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ₹1,08,073/- వేతనం లభిస్తుంది. ఈ రోల్‌కు అర్హత పొందేందుకు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి, ముఖ్యంగా సిగ్నల్ ప్రాసెసింగ్, టెస్టింగ్ వంటి కీలక రంగాల్లో అనుభవం అవసరం. ఈ ఉద్యోగం సైన్స్ & టెక్నాలజీ రంగంలో ప్రత్యేకమైనదిగా, ముఖ్యంగా సిగ్నల్ ప్రాసెసింగ్ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, మరియు పరీక్షల కోసం రూపొందించబడింది.
4. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘B’
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘B’ పోస్టుకు 2 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైతే ₹90,789/- వేతనం లభిస్తుంది. అర్హతల విషయానికి వస్తే, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. కానీ, GATE స్కోర్ ఉంటే అదనపు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ ఉద్యోగం ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మరియు సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వాళ్లకు గొప్ప అవకాశం. DRDO లాంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థలో పని చేయాలనుకునే వారికి ఇది అత్యుత్తమ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉద్యోగం అంటే కేవలం వేతనం కోసం మాత్రమే కాదు, దేశ రక్షణకు ఉపయోగపడే అత్యాధునిక టెక్నాలజీల రూపకల్పనలో మీ భాగస్వామ్యం ఉంటుంది. కావున, అర్హత ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి!
DRDO Scientist Recruitment 2025 Selection Process
DRDO Project scientists పోస్టుల ఎంపిక చాలా జాగ్రత్తగా, మూడు ప్రధాన దశల ద్వారా జరుగుతుంది. మొదటగా, ఆడ్మినిస్ట్రేటివ్ స్క్రీనింగ్ జరుగుతుంది, ఇందులో అభ్యర్థుల విద్యార్హతలు, వయస్సు, మరియు పని అనుభవం పరిశీలిస్తారు. దీని ద్వారా ప్రాథమిక అర్హత కలిగిన అభ్యర్థులను ముందుకు పంపుతారు.
తర్వాత టెక్నికల్ స్క్రీనింగ్ జరుగుతుంది, ఇది ఎంతో కీలకం. అభ్యర్థుల అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు, ప్రాజెక్ట్ అనుభవం వంటి అంశాలను లోతుగా విశ్లేషిస్తారు. ఈ దశలో ఎవరెవరు టెక్నికల్‌గా బలంగా ఉన్నారో అర్థమవుతుంది.
చివరిగా, ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 70% మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 60% మార్కులు సాధించాలి. ఈ ముగ్గురు దశలను విజయవంతంగా పూర్తి చేసిన వారికే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
Vacancy Details
DRDO Project Scientists recruitment 2025 లో 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘F’, ‘D’, ‘C’, ‘B’ స్థాయిలలో ఖాళీలు ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కింద చూడొచ్చు.
Name of the Post | No. of Vacancies |
Project Scientist ‘F’ | 01 |
Project Scientist ‘D’ | 10 |
Project Scientist ‘C’ | 07 |
Project Scientist ‘B’ | 02 |
Total Vacancies | 20 |
DRDO Scientists Eligibility Criteria (కావసిన అర్హతలు)
DRDOలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగం పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి. ముందుగా, సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. అలాగే GATE స్కోర్ ఉంటే అదనపు ప్రాధాన్యత ఇస్తారు. కింద ఉన్న పట్టికలో ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు స్పష్టంగా ఇచ్చాం. మీరు మీ అర్హతలు చూసుకుని సరైన పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Name of the Post | Education Qualification | Upper Age Limit |
Project Scientist ‘F’ | ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్) + 10 ఏళ్ల అనుభవం | 55 years |
Project Scientist ‘D’ | ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) + 5 ఏళ్ల అనుభవం | 45 years |
Project Scientist ‘C’ | ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) + 3 ఏళ్ల అనుభవం | 40 years |
Project Scientist ‘B’ | ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ (GATE స్కోర్ ఉంటే ప్రాధాన్యం) | 35 years |
ఈ అర్హతల ప్రకారం మీరు మీకు సరైన ఉద్యోగానికి దరఖాస్తుచేసుకోండి. DRDOలో పనిచేయడం ద్వారా మీ కెరీర్‌ను ఒక మంచి స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
DRDO Scientists Salary Details
DRDO Project Scientists ఉద్యోగాల్లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹90,789/- నుండి ₹2,20,717/- వరకు వేతనం లభిస్తుంది. ఈ వేతనాలు అభ్యర్థి ఎంపిక అయినా పోస్టు స్థాయి మరియు ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటాయి. కింద ఇచ్చిన పట్టికలో ప్రతి పోస్టుకు సంబంధించిన వేతన వివరాలు చూడొచ్చు.
Name of the Post | Salary (Per Month) |
Project Scientist ‘F’ | ₹2,20,717/ |
Project Scientist ‘D’ | ₹1,24,612/- |
Project Scientist ‘C’ | ₹1,08,073/- |
Project Scientist ‘B’ | ₹90,789/- |
వేతనంతోపాటు మరెన్నో బెనిఫిట్స్ ఈ ఉద్యోగం లో లభిస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ సౌకర్యాలు, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రావెల్ అలవెన్స్ (TA), డియర్‌నెస్ అలవెన్స్ (DA) లాంటివి అదనంగా లభిస్తాయి.
దరఖాస్తు సమయంలో కావసిన Documents
- జనన ధృవపత్రం
- డిగ్రీ సర్టిఫికేట్స్
- అనుభవ ధృవపత్రాలు
- GATE స్కోర్ (ప్రయోజనం కోసం)
- కస్టు / వికలాంగ ధృవపత్రం (SC/ST/PwD వారికి)
- రీసెర్చ్ అనుభవం ఉంటే సంబంధిత ధృవపత్రాలు
దరఖాస్తు చేసుకునే విధానం
DRDO ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలకున్నవారు ముందుగా, RAC అధికారిక వెబ్‌సైట్ https://rac.gov.in కి వెళ్లి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, అవసరమైన వివరాలతో డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫార్మ్ సబ్మిట్ చేయాలి.
FAQS
1. DRDO ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి?
RAC వెబ్‌సైట్ https://rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.
2. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేస్‌లో ఉంటాయా?
అవును, ప్రాథమికంగా 2027 ఏప్రిల్ 18 వరకు కాంట్రాక్ట్ ఉంటుంది.
3. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి?
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
4. చివరి తేదీ తరువాత దరఖాస్తు సమర్పించవచ్చా?
కాదు, 2025 ఏప్రిల్ 1 తర్వాత దరఖాస్తులు తిరస్కరించబడతాయి.