అందరికి నమస్కారం, ఇండియన్ రైల్వేస్ జాబ్స్ కోసం ఎదురు చోస్తున్న వారికి శుభవార్త, RRB ALP Notification 2025 విడుదలయింది Railway Recruitment board (RRB) ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 9900 RRB Assistant Loco Pilot (ALP) ఉద్యోగ ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ ఉంద్యోగాలకు సంభందించి ఆన్లైన్ లో ఏప్రిల్ 10 వ తేదీ నుండి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు. ఈ ఉద్యోగాలకి IIT Diploma/ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగి, 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న స్త్రీ, పురుషులు ఈ ఉద్యోగాలకి అర్హులు.
ఈ RRB ALP Notification 2025 కి సంభందించి కావలసిన విధ్యా అర్హతలు, సెల్లెక్షన్ ప్రాసెస్, పరీక్షా విధానం, ఏజ్, శాలరీ వంటి అన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో పొందుపరచాము ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి గడువు తేదీ లోపు ఈ ఉద్యోగానికి అప్లై చేస్కోండి.
RRB ALP Notification 2025 ముఖ్యమైన తేదీలు
RRB ALP Notification 2025 అప్లికేషన్ ఆన్‌లైన్ ప్రక్రియ 10 ఏప్రిల్ 2025 న ప్రారంభమవుతుంది మరియు 09 మే 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంభందించి ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో ఇచ్చాము గమనించగలరు.
ఈవెంట్ | తేదీ |
---|---|
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం (Tentative) | 10 ఏప్రిల్ 2025 |
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ (Tentative) | 09 మే 2025 (23:59 గంటలు) |
Indicative Notice Employment News విడుదల | 29 మార్చ్ – 04 ఏప్రిల్ 2025 |
పూర్తి నోటిఫికేషన్ (CEN No. 01/2025 ALP) విడుదల | 09 ఏప్రిల్ 2025 (RRB వెబ్‌సైట్‌లపై) |
పోస్టులు మరియు ఖాళీలు
Assistant Loco Pilot (ALP) 2025 కోసం మొత్తం సుమారు 9,900 ఖాళీలు (అన్ని RRB జోన్‌ల కలిపి) విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రారంభ జీతం ₹19,900/- గా ఉంటుంది.
పోస్టు పేరు | Pay Level (7th CPC) | Initial Pay (Rs.) | మెడికల్ స్టాండర్డ్ | వయస్సు | సుమారు ఖాళీలు |
---|---|---|---|---|---|
Assistant Loco Pilot (ALP) | Level 2 | ₹19,900/- | A-1 | 18–30 సంవత్సరాలు | 9,900 |
కావలసిన అర్హతలు
1. విద్యార్హత
- సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా లేదా సార్వత్రిక శిక్షణా కోర్సులు (ITI) లేదా సమానమైన విద్యార్హత
2. మెడికల్ స్టాండర్డ్:
- A-1 ఫిట్‌నెస్ (ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగాల స్టాండర్డ్).
- 6/6 విజన్ (నేరుగా Aadhar డేటాతో మ్యాచ్ చేయాలి).
- Hearing, Blood Pressure, General Fitness టెస్ట్‌లు.
వయస్సు పరిమితి (Age Limit)
ఈ Assistant Loco Pilot (ALP) ఉద్యోగాలకి 18 సంవత్సరాలనుండి 30 సంవత్సరాల వయసు ఉన్న వారు అర్హులు.
ఎంపిక ప్రక్రియ & ఎగ్జామ్ స్ట్రక్చర్
RRB Assistant Loco Pilot (ALP) ఎంపిక ప్రాసెస్ 4 దశలుగా ఉంటుంది.
1. Stage-I CBT (Preliminary)
- 75 ప్రశ్నలు, 60 నిమిషాలు
- జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అంకెల జ్ఞానం
- నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు 1/3 మార్కులు కట్
2. Stage-II CBT (Main)
- Module-I: జనరల్ అవేర్‌నెFinal Stageలో మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్.స్ & రీజనింగ్ (100 ప్రశ్నలు, 90 నిమిషాలు)
- Module-II: Technical Ability (75 ప్రశ్నలు, 90 నిమిషాలు)
- Module-III: Direct ALP Trade Test (75 ప్రశ్నలు, 60 నిమిషాలు)
3. Document Verification (DV):
- CBT ర్యాంక్ ఆధారంగా కాతరించబడిన అభ్యర్థులను డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు.
4. Medical Examination:
- Final Stageలో మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్.
Stage-I & Stage-II కోసం Minimum qualifying marks ఉంటాయి:
GEN/EWS: 40%, OBC/SC: 30%, ST: 25%.
సిలబస్ (Detailed Syllabus)
Stage-I CBT Topics
- జనరల్ అవేర్‌నెస్ & జి.కె.: భారత చరిత్ర, జియోగ్రఫీ, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్ (చివరి 6 నెలలు), అవార్డులు, ఖాళీలు.
- జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: సీక్వెన్స్, కోడింగ్-డీకోడింగ్, పజిల్స్, విజువల్ రీజనింగ్.
- అంకెల జ్ఞానం: బేసిక్ అరిత్మేటిక్ (ప్రత్యేకంగా బడ్జెట్, రేషియో, టైమ్ & వర్క్).
Stage-II CBT Module-II (Technical)
- Mechanical Engineering (మెకానికల్ ఇంజనీరింగ్): థర్మోడైనమిక్స్, మెషిన్ డ్రాయింగ్, మెటీరియల్ సైన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్
- Electrical Engineering (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్): సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, మెజర్మెంట్స్
- Electronics Engineering: అనలాగ్ & డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్
Module-III (Trade-specific)
- ప్రతి ట్రేడ్‌కు సంబంధించిన Practical & Theoretical ప్రశ్నలు. Annexure D లో ట్రేడ్-వైజ్ టాపిక్స్.
అప్లికేషన్ ఫీజు & రీఫండ్
కేటగిరీ | ఫీజు | రీఫండ్ వివరాలు |
---|---|---|
GEN/OBC/EWS | ₹500/- | CBT హాజరైనవారికి ₹400/- తిరిగి |
SC/ST/PwBD/మహిళలు/ట్రాన్స్‌జెండర్ | ₹250/- | CBT హాజరైనవారికి ₹250/- తిరిగి |
ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ Submit చేయాలి. బ్యాంక్ ఛార్జెస్ వర్తిస్తాయి.
అప్లికేషన్ విధానం (Application Process)
RRB ALP Notification 2025 కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ లో ఉంటుంది . కాబట్టి ముందుగా అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకుని, దశలవారీగా అప్లికేషన్ పూర్తి చేయాలి. అప్లై చేసుకోదగిన అభ్యర్థులు క్రింది సూచనలు చదవండి.
అప్లికేషన్ విధానం – స్టెప్ బై స్టెప్
1. ఆధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి:
మీకు సంబంధించిన RRB జోన్ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. ఉదాహరణకు: www.rrbsecunderabad.gov.in
2. నోటిఫికేషన్ చదవండి:
CEN No. 01/2025 ALP నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హత, వయస్సు పరిమితి, మెడికల్ అవసరాలు తెలుసుకోవాలి.
3. రిజిస్ట్రేషన్ చేయండి:
కొత్త యూజర్ అయితే, మొదట మీరు మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయాలి.
4. లాగిన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి:
స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (లేటెస్ట్) మరియు సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. ఫార్మాట్ & సైజ్ నోటిఫికేషన్‌లో ఇవ్వబడుతుంది.
5. ఫోటో & సిగ్నేచర్ అప్‌లోడ్ చేయండి:
స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (లేటెస్ట్) మరియు సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. ఫార్మాట్ & సైజ్ నోటిఫికేషన్‌లో ఇవ్వబడుతుంది.
6. Caste ఆధారంగా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి (ఐతే అవసరమైతే):
SC/ST/OBC/EWS/PwBD అభ్యర్థులు తమ కేటగిరీకి సంబంధించి సరైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
7. ఫీజు చెల్లించండి:
అప్లికేషన్ ఫీజు డెబిట్ కార్డు / క్రెడిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
- General/OBC అభ్యర్థులకు: ₹500/-
- SC/ST/PwBD/మహిళల అభ్యర్థులకు: ₹250/-
8. ఫారమ్ రివ్యూ చేసి సబ్మిట్ చేయండి:
ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందు మొత్తం వివరాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసే అవకాశం ఉండదు.
9. ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు:
దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్‌ను భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి కాపీగా భద్రపరచండి.